వాట్సాప్‌లో స్టేటస్ ఆప్షన్ వచ్చేసింది. అదేంటి వచ్చి చాలా రోజులైంది కదా అనుకుంటున్నారా? మేం చెబుతోంది పాత వాట్సాప్ స్టేటస్ గురించి. మనసులోని భావాల్ని అక్షరాల రూపంలో పెట్టుకునే పాతకాలం స్టేటస్ గురించి. ఇమేజ్/వీడియో స్టేటస్ సౌకర్యాన్ని తీసుకొచ్చి అక్షరాల స్టేటస్‌ను ఇటీవల ఎత్తేసింది వాట్సాప్ . ఇప్పుడు మళ్లీ దాన్ని తీసుకొచ్చేసింది. అయితే ఈ సారి స్టేటస్ వాక్యాలు కనిపించే ప్రాంతం మారింది. గతంలో మెనూ బటన్‌లో స్టేటస్ అని ఓ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు సెట్టింగ్స్‌లో ఉండే మీ పేరును టచ్ చేస్తే దిగువన మొబైల్ నెంబర్ మీద మీ స్టేటస్ కనిపిస్తుంది. దాన్ని ఒత్తి స్టేటస్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.