ఐఫోన్లలో వాట్సాప్‌ను వాడుతున్న వారి కోసం కొత్త అప్డేట్ విడుదలైంది. ఈ అప్డేట్ ద్వారా యూజర్లకు కొత్త ఫీచర్లు లభిస్తున్నాయి. ఆల్బమ్స్, ఫిల్టర్స్, రిప్లై షార్ట్‌కట్ అనే మూడు కొత్త ఫీచర్లు ఈ అప్డేట్లో లభ్యమవుతున్నాయి. వాట్సాప్‌లో యూజర్‌కు ఒకేసారి వచ్చే ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు అన్నీ కలిపి ఒకే ఆల్బంగా ఆటోమేటిక్‌గా మారుతాయి. ఆ ఆల్బమ్‌ను ఓపెన్ చేస్తే అందులో ఆ ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు ఉంటాయి.
ఇక ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఐఫోన్లో వాట్సాప్‌తో ఫొటోలు, వీడియోలు తీసినప్పుడు వాటికి ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడే ఫిల్టర్లను అప్లై చేసుకోవచ్చు. దీంతో ఫొటోలు, వీడియోలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రస్తుతం పాప్, బ్లాక్, వైట్, కూల్, క్రోమ్, ఫిలిం అనే ఫిల్టర్లు లభిస్తున్నాయి. ఇక 3వదైన రిప్లై షార్ట్‌కట్ సహాయంతో యూజర్ తనకు వచ్చే మెసేజ్‌లకు సులభంగా రిప్లై ఇవ్వవచ్చు. అందుకు గాను మెసేజ్‌లపై కుడి వైపుకు స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ను ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వెర్షన్ 2.17.30 నంబర్లో ఈ అప్డేట్ లభిస్తున్నది.