//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ రీకాల్

Category : technology world

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లకు మరింత ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఫీచర్ ను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎవరికైనా మెసేజ్ ను కానీ, ఇమేజ్ లను కాని పొరపాటున పంపినట్టైతే, వాటిని రీకాల్ చేసుకోవడం కుదరదు. కానీ తాజాగా తీసుకురాబోతున్న ఫీచర్ తో వాటిని రీకాల్ చేసుకోవచ్చు. పొరపాటున పంపిన మెసేజ్ లను, వీడియోలను, ఇమేజ్ లను వెనక్కి తీసుకోవడానికి ఐదు నిమిషాల విండో ఉంటుంది. ''రీకాల్'' పేరు మీద సరికొత్త ఫీచర్ ను తీసుకురావడానికి వాట్సాప్ సన్నద్ధమైందని డబ్ల్యూబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు టెక్ట్స్ లను, ఇమేజ్ లను, వీడియోలను, జీఐఎఫ్‌స్, డాక్యుమెంట్లు, స్టేటస్ కు ఇచ్చిన మెసేజ్ లను ఐదు నిమిషాల విండో వ్యవధిలో రీకాల్ చేసుకోవచ్చని ఇండిపెండెంట్ రిపోర్టు చేసింది.

2.17.30+ వెర్షన్, ప్రస్తుతం వాట్సాప్ వెర్షన్ 2.17.190కు ఈ రీకాల్ ఫీచర్ ఎనాబుల్ అవుతుందని పేర్కొంది. వాట్సాప్ ఇటీవలే బీటా వెర్షన్లకు ఎడిట్ ఫీచర్ ను తీసుకొచ్చింది. యూజర్లు తాము పంపిన మెసేజ్ లలలో ఎలాంటి తప్పులు దొర్లినా.. టెక్ట్స్ ను మార్చాలనుకున్నప్పుడు దీంతో ఎడిట్ చేసుకోవచ్చు. అయితే తాజా మెసేజ్ లను మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని మాత్రమే వాట్సాప్ కల్పిస్తోంది.