//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డిజిటల్ చెల్లింపుల సేవల్లోకి అడుగులేస్తున్న వాట్సప్ !

Category : business national

ఫేస్‌బుక్‌ నేతృత్వంలోని మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలోనే డిజిటల్‌ చెల్లింపు సేవలను ప్రారంభించనుంది. భారత్‌ నుంచే ఈ సేవలకు శ్రీకారం చుట్టనుంది.పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ సేవల వైపు భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. యుపిఐ వాడుతూ పేమెంట్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ అయ్యేలా కంపెనీ ప్రస్తుతం వర్క్ చేస్తోంది. ఈ చాట్ యాప్ ద్వారానే అన్ని పేమెంట్లు జరిగేలా భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. అలాగే డిజిటల్‌ లావాదేవీల విభాగానికి అధిపతిని నియమించుకునే పనిలో ఉంది. భారత్‌లో డిజిటల్‌ సేవల వ్యాప్తికి సహకారం అందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు గత ఫిబ్రవరిలో ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో వాట్సాప్‌ సహవ్యవస్థాపకుడు బ్రియన్‌ యాక్టన్‌ సమావేశమయ్యారు. తాజాగా సంస్థ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఉద్యోగావకాశం నోటిఫికేషన్ ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. ఆ జాబ్ నోటిఫికేషన్ ప్రకారం.. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఆర్థిక సేవలు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), భీమ్ యాప్‌లపై అవగాహన ఉన్న వారి కోసం సంస్థ వెతుకుతున్నదివాట్సాప్‌కు భారతే అతిపెద్ద విపణి. ప్రపంచమొత్తం మీద వాట్సాప్‌కు 100 కోట్ల మంది వినియోగదారులుంటే.. ఇక్కడే 20 కోట్ల మంది ఉండటం గమనార్హం.వచ్చే ఆరు నెలల్లోనే ఈ సర్వీసులు ప్రారంభించబోతున్నారని సమాచారం