//single page style gallary page

What's going on in the original TV-9 ownership The original facts behind Ravi Prakash Out from TV-9?

Category : state

Click here to read this article in Telugu

అసలు టీవీ-9 యాజమాన్యం లో ఏం జరుగుతుంది...టీవీ-9 నుంచి రవి ప్రకాష్ ఔట్ వెనుక అసలు నిజాలు....?

తెలుగు శాటిలైట్‌ చానళ్లలో నూతన ఒరవడి తీసుకొచ్చిన వెలిచేటి రవిప్రకాశ్‌ టీవీ 9 నుంచి ఆ ఛానెల్ సీ.ఈ .ఓ ఎదిగిన తీరు అమోఘం. ఇది ఇలా ఉంటే ఆ చానల్లో 90% వాటాను మైహోమ్‌ గ్రూప్, మేఘ ఇంజనీరింగ్‌ సంస్థలకు చెందిన అలందా గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసింది. 90% వాటా కొనుగోలు చేసినప్పటికీ.. తమకు రవిప్రకాశ్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారని, కంపెనీ సెక్రటరీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని, అందుకే ఆయన్ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నామని అలందా మీడియా పేర్కొంది.కానీ.. గురువారం సాయం త్రం రవిప్రకాశ్‌ టీవీ9 చానల్లో కనిపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆయన కొట్టి పారేశారు. అంతే తప్ప.. ఫోర్జరీ కేసు గురించిగానీ, తనపై వచ్చిన ఇతర అభియోగాల గురించి కానీ ప్రస్తావించలేదు.

టీవీ9 లోగోతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లిష్, హిందీ చానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (ఏబీసీఎల్‌)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్‌ వెంచర్‌ కేపిటల్‌ ఫండ్‌ ప్రారంభించాయి. ఏబీసీఎల్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉంది. ఈ సంస్థలో ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా ఎదిగిన రవిప్రకాశ్, ఆయన సహచరులకు 9% వాటా ఉంది. గత ఆగస్టులో శ్రీనిరాజు తన వాటాను హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియాకు విక్రయించారు. అదే నెలలో డీల్‌ పూర్తయి ఏబీసీఎల్‌ యాజమాన్యం అలందా చేతిలోకి వచ్చింది. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార శాఖ.. మొన్నటి మార్చి 29న అనుమతి కూడా మంజూరు చేసింది. అన్ని అనుమతులూ ఉన్నా.. కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్‌కు రవిప్రకాశ్‌ రకరకాలుగా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఆ నలుగురు డైరెక్టర్లూ ఏప్రిల్‌ 23న సమావేశమై.. తమ నియామక పత్రాలను ఆర్‌ఓసీలో దాఖలు చేయాలని కంపెనీ సెక్రటరీని కోరారు.

దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కొందరు ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారనేది అలందా అభియోగం. దీనిపై కంపెనీ సెక్రటరీ కూడా ఆర్‌ఓసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకు న్న ఆర్‌ఓసీ అధికారులు ఏబీసీఎల్‌లో కొత్త డైరెక్టర్ల నియామక పత్రాలను ఆమోదించారు. ‘90% వాటా మా చేతిలోనే ఉంది. కనుక చట్టపరంగా పూర్తి అధికారం మాకే ఉంది. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్‌ వైఖరిని సీరియస్‌గా తీసుకుని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయించాం’అని అలందా మీడియా తెలియజేసింది.

దురుద్దేశపూర్వకంగా సినీ నటుడు శొంఠినేని శివాజీతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించారని, సంస్థ నిర్వహణలో తమకు ఇబ్బందులు కల్పించేలా రవిప్రకాశ్‌ ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టీవీ9 కొత్త యాజమాన్యం పేర్కొంది. కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డేటాను తస్కరించడమే కాక, దాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదులో తెలిపింది. రవిప్రకాశ్‌కు టీవీ9లో 20 లక్షల షేర్లుండగా (9%) దాన్లో 40 వేల షేర్లు తనకు విక్రయించడానికి 2018 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుని డబ్బులు చెల్లించానని, ఏడాదిలోగా బదిలీ చేయాల్సి ఉన్నా రకరకాల సాకులతో చేయలేదని, ఏబీసీఎల్‌ యాజమాన్య మార్పులపై తనకు నిజాలు చెప్పలేదని ఆరోపిస్తూ శివాజీ ఎన్సీఎల్టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌)కు వెళ్లటం తెలిసిందే. ఏదో ఒక వివాదాన్ని సృష్టించి.. కొత్త యాజమాన్యానికి అడ్డంకులు సృష్టించటమే శివాజీ ఉద్దేశమని అలందా పేర్కొంది. శివాజీ చెబుతున్న షేర్‌ పర్ఛేజ్‌ అగ్రిమెంట్‌ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం ఇక్కడ గమనార్హం.

The channel CEO is awesome from the TV 9, which is a good source of Telugu channels. This is a 90% stake in the channels purchased recently by the Aladda Group of Myhom Group and Cloud Engineering. Even though 90% of the stake is bought, Ravi Prakash has created barriers and company secretary's signature has been forgotten and hence he is withdrawing from the position of the CEO. But on Thursday, the Ravi Prakash TV appeared on TV channels. He dismissed allegations that he was coming back to him. Besides, he did not mention the forgery of the forgery or the other charges.

The Associated Broadcasting Company (ABCL), which operates Telugu, Marathi, Kannada, Gujarati, English and Hindi channels with TV9 logo, was launched by Businessman Sriniraju's Chintalapati Holdings and Iles Venture Capital Fund. The ABCL has over 90 per cent stake in both the companies. Ravi Prakash and his associates have a 9% stake in the company as CEO and Director. In August last year, Srinirajah sold his stake to Hyderabad's Aluada Media. The deal was completed in the same month and the ABCL management came to the hands of the jewelery. The Central Information Commission, which examined the application, was granted permission on March 29. All the permissions .. Ravi Prakash has been blocking the board meeting with new directors. The four directors met on April 23 and requested the company secretary to file their recruitment documents in the ROSE.

Raviprakash and his close associates were accused of creating a forgery document that some of the company's secretary had resigned. The company secretary also complained to ROC. The ROC officers, taking into consideration this, approved the appointment of new directors at ABCL. '90% share is in our hands. So we are legally entitled to full power. That's why we have decided to take Ravi Prakash's attitude seriously and remove him from the post, "said Ananda Media.

TV9's new owners have complained that Ravi Prakash is trying to create a fake documentary with malicious actress Shivaji in the name of Shivaji. The complaint also said that the conspiracy was not only to bring down the important data of the company but also to suspect that it had been sent to outsiders. Shivaji went to NCLL (National Institute of Law Tribunal) alleging that Ravi Prakash was not paying any amount of money for transferring money to 20,000 shares (9 per cent) in the TV 9 and in February 2018 to sell it in February 2018. Shiva's intention is to create a controversy and create barriers to new ownership. It is noteworthy that Shiv Pawar's Agreement is just on white paper.