సర్వేల స్పెషలిస్ట్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన లగడపాటి తెలంగాణా ఎన్నికల ఫలితాల విషయంలో తప్పులో కాలేశారా ? ముందు టీఆర్ ఎస్ గెలుస్తుంది అని కేటీఆర్ కు ట్వీట్ చేసిన లగడపాటి తర్వాత మాట మార్చారా? తన సర్వే ఫలితాలు తరువాత చెప్తానని చెప్పి ముందే చెప్పి మహాకూటమి వైపు గాలి ఉన్నట్టు క్రియేట్ చేశారా అంటే అవును అనే అంటునారు గులాబీ శ్రేణులు. తన విశ్వసనీయత దెబ్బ తీసుకునేలా తెలంగాణా ఎన్నికలపైఆయన ఇచ్చిన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు .మొత్తానికి ఆయన ఇమేజ్ తెలంగాణా ఎన్నికలతో డ్యామేజ్ అవుతుందని చాలా విశ్వాసంతో ఉన్నారు గులాబీ శ్రేణులు.
మొదట నుండీ తన సర్వే ఫలితాలను పోలింగ్ రోజు సాయంత్రం వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు లగడపాటి రాజగోపాల్ . అయినా మొదటనుండీ ఆయన సర్వేల పేరుతో పలు ఫేక్ సర్వేలు రాజకీయ దుమారం రేపాయి. ఇక తన సర్వే ఫలితాలు వెల్లడించకూడదని నిర్ణయించుకున్న లగడపాటిని రోజుకో రకంగా సర్వే గురించి మాట్లాడేలా చేసాయి తెలంగాణాలోని రాజకీయాలు. సర్వేల విషయంలో పక్కాగా ఉండే లగడపాటి తప్పుడు సర్వే ఫలితాలు ఇస్తారా ? చంద్రబాబు ప్రభావంతోనే అలా చేశారా అంటే ... చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే తన మీద ఉన్న విశ్వసనీయతను ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బ తీసుకోరు అనే అభిప్రాయం ఉన్నా చంద్రబాబు కోసం ఆ మాత్రం చేసి ఉండొచ్చు అన్న భావన వుంది.
ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలంగాణా ఎన్నికలలో గాలి ఏ పార్టీ వైపు ఉందో ముందే చెప్పి సంచలనం సృష్టించారు. సహజంగా ఎన్నికల తరువాత తన సర్వే ఫలితాలు ప్రకటించే లగడపాటి ఈ సారి ముందే చెప్పారు. దానికి ఆయన కూటమి పక్షాన , చంద్రబాబుకు అండగా నిలవటమే కారణం అని చెప్తున్నారు. తన సర్వే ఫలితాలను మొదట ఇండిపెండెంట్ల పేర్ల తో మొదలు పెట్టిన ఆయనపై ఈసీ కి ఫిర్యాదు చేసి ట్విట్టర్ వేదికగా రెచ్చగొట్టి కేటీఆర్ అనవసరపు రగడ చేసుకున్నారు . ఒక్క సీట్ల అంచనా తప్ప మహాకూటమికే ఈ ఎన్నికలు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీనితో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం రసకందాయంగా మారింది.
అయితే ఓడిపోవడం గారంటీ అని తెలిసి చంద్రబాబే లగడపాటితో దొంగ సర్వే చెప్పించారని గులాబీ శ్రేణులు ఆరోపిస్తే లగడపాటి చెప్పిన ఫలితాలతో సంబరంలో మునిగిపోయారు మహాకూటమి శ్రేణులు. అయితే ఇంతకు లగడపాటి నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? అంటే అర్ధం కాని స్థితి. ఒక పక్క లగడపాటి భార్య టీఆర్ ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కు ప్రచారం చెయ్యడంతో ఇక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. మరోపక్క లగడపాటి గుట్టు కేటీఆర్ రట్టు చేశారు. నిజంగా ఒకవేళ లగడపాటి ఇప్పుడు అబద్ధం చెప్పినా రేపు పోలింగ్ తరువాత ఖచ్చితంగా నిజమే చెప్తారు. చెప్పాలి కూడా లేకుంటే అది ఆయనపై ఉన్న నమ్మకాన్ని నాశనం చేసే ప్రమాదం వుంది. అలా తనపై విశ్వాసం కోల్పోటానికే లగడపాటి అనాలోచిత ప్రకటన చేశారని ఇక అదే విధంగా లగడపాటి చేత చంద్రబాబు అబద్ధం చెప్పించారు అనే దాని మీద కూడా కొంత అనుమానం ఉన్న నేపధ్యంలో ఒకవేళ నిజంగా లగడపాటి చంద్రబాబు కంట్రోల్ లో ఉంటే ఆయనను మేలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు చంద్రబాబు అవకాశం ఇస్తారు.
ఈ సమయంలో లగడపాటి విశ్వసనీయత దెబ్బ తీస్తే అది చంద్రబాబు కు నష్టం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు ఆ పని చేసి ఉంటారా? అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆలోచన ఉంది. అసలు లగడపాటి ఇమేజ్ ను తానె డ్యామేజ్ చేసుకుంటాడా ?లగడపాటికి ఉన్న ఇమేజ్ వల్లే ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినా ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు నిజమయ్యాయని భావించే సర్వేల్లో ఇప్పుడు ఇది తప్పని తేలితే మున్ముందు ఆయన సర్వేలను ఎవరూ విశ్వసించరు. ఈ క్రమంలో ఆయన అనవసరంగా కూటమికి అనుకూల ప్రకటన చేసి రిస్క్ లో పడ్డారని భావించే వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణా లో ఓటర్లు తీర్పు ఏం ఇవ్వబోతున్నారు ఇక ఆయన ఇమేజ్ ఉంటుందా లేకా డ్యామేజ్ అవుతుందా అనేది మరికొన్ని గంటల్లోనే తేలే అవకాశం వుంది.