తెలంగాణలో పొత్తులపై బహిరంగంగా, అది కూడా సభా ముఖంగా బయటపెట్టాడు సీఎం చంద్రబాబు. తెలంగాణలో, టీఆర్ఎస్ టీడీపీతో కలిసి పనిచేయాలనుకున్నందుకు చెప్పుకొచ్చాడు. కేంద్రం తగువులుపెట్టి.. మోడీ అడ్డుపుల్ల వేసి విరక్కొట్టారని సంచలన విషయాలను బయటపెట్టారు సీఎం చంద్రబాబు. What is the Reason TDP doesn't merge to TRS
తెలంగాణలో పొత్తులపై బయటపడిపోయాడు చంద్రబాబు. తొలిసారిగా, బహిరంగంగా ఓపెనయ్యారు సీఎం చంద్రబాబు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనుకున్నామని, అయితే, బీజేపీ అడ్డుపుల్ల వేస్తోందని అసలు విషయాన్ని బయటపెట్టాడు. బీజేపీ వ్యూహాత్మకంగా కుట్ర చేసి విడగొట్టిందన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ కలిస్తే బలపడతాయని తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాల్లో ఉంటాయని, అందుకే ప్రధాని మోడీ విభజించు.. పాలించు అనే ఎత్తుగడ వేశాడని చంద్రబాబు చెప్పిన మాటతో ఒకటి కాదు.. నాలుగైదు విషయాలు తెలిసిపోయాయి.What is the Reason TDP doesn't merge to TRS
మొదటిది చంద్రబాబు టీఆర్ఎస్ వైపు చూశాడు. కాదు.. కూడదు అనేసరికి తెలంగాణలో పొత్తు నిర్ణయాన్ని పార్టీకే వదిలేశారు. రెండో విషయం.. టీఆర్ఎస్, కేసీఆర్ ఇప్పుడు బీజేపీ చెప్పుచేతల్లో ఉన్నాయి. ఆ విషయం బాబు మాటల్లో రుజువైపోయింది. మూడోది తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. కేసీఆర్.. బీజేపీ ఒక్కటే అన్నాడు. అంటే, ఇక ఆ ప్రభావం మామూలుగా ఉండదు. ఇక నాలుగో విషయం ఏమిటంటే..! తన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండటమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అది తెలుగు ప్రజలకే ప్రయోజనం.