//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నగరి ని మరచిన రోజా..!

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హడావిడి అప్పుడే మొదలయింది. ప్రతి నియోజక వర్గంలోను అక్కడి ఎమ్మెల్యేలు బిజీగా గడుపుతూ వున్నారు. అందరూ ఎన్నికలకి సిద్దమౌతుంటే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం ఇంకా ఎన్నికల రణరంగం లోకి దిగలేదు.

నగరి లో త‌న బ‌ల‌మైన ప్రత్యర్థి, టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణమ‌నాయుడి అకాల మ‌ర‌ణం, ఇటీవ‌ల ఓ టీడీపీ ప‌త్రిక త‌న స‌ర్వేలో న‌గ‌రి నుంచి తిరిగి రోజా గెలుపొందుతుంద‌ని క‌థ‌నం రాయ‌డంతో రోజా త‌న సీటుకు ఇబ్బంది లేద‌నే భ‌రోసాతో రిలాక్స్ అవుతున్నట్టుగా క‌నిపిస్తున్నారు.

రోజా హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన కొత్తలో ఆమె వారానికి ఒక‌సారి వ‌చ్చి కార్యక‌ర్తల‌తో మాట్లాడి వారి మంచీచెడులను ఆరా తీసేవారు. ఆ త‌ర్వాత రానురానూ రెండువారాల‌కు ఒక‌సారి వ‌చ్చి క‌నిపించేవారు. ఇటీవ‌ల మూడునెల‌ల పాటు న‌గ‌రి వైపు ఆమె క‌న్నెత్తి చూడ‌లేద‌ని వైసీపీ శ్రేణులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నాయి.

చిత్తూరుజిల్లాలో న‌గ‌రికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాజ‌కీయ ఉద్దండులైన గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు, రెడ్డివారి చెంగారెడ్డి పోటాపోటీగా త‌ల‌ప‌డేవారు. వీరిద్దరూ నిత్యం జ‌నం మ‌ధ్య ఉంటూ వారి కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిగా మెలిగేవారు. నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు సంబంధించి శుభ‌, అశుభ కార్యాల‌కు పిలుపుతో సంబంధం లేకుండా వెళుతూ వారి ప్రేమాభిమానాల‌కు పాత్రుల‌య్యారు.

2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో గాలి ముద్దుకృష్ణమ‌నాయుడిపై వైసీపీ మ‌హిళానేత‌, సినీన‌టి రోజా 700 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొంది త‌న చిర‌కాల కోరిక తీర్చుకున్నారు. ఇటీవ‌ల అనారోగ్యంతో గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు తుదిశ్వాస విడిచారు. దీంతో న‌గ‌రి ఏ దిక్కూలేని అనాథైంది. ప్రజ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన రోజు క‌నీసం ఫోన్‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో న‌గ‌రి వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ర‌గ‌లిపోతున్నాయి.

Related News