//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వేంకటేశుడే ఈశ్వరుడా కపిలతీర్ధం గొప్పదనం ఏంటి

Category : national

ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారు వైష్ణవాకృతిగా నమ్మేవారుంటారు..ఇదే ఆలయం పాదాల చెంత మరో గొప్ప క్షేత్రం ఉంది..అది మహాశివుడిది కావడం మరో విశేషం.. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి కిందివైపు మనోహరంగా కన్పిస్తుంటుంది వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... జలపాతంలా జాలువారే నీటి ధారలు చూపుతిప్పనివ్వవు. .కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం  తపస్సు చేశాడట. దీంతో పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు.

ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఇక్కడి ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా అంటారు. ఈ తీర్ధంపై భాగాన అమరాయా అన్నట్లు ఉండే తిరుమల కొండలు నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు.