//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయం అంటే?

Category : politics editorial

రాజకీయం అంటే?

వెనుకటి రోజుల్లో రాజ్యాలను కాపాడుకోవటాని,అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొటానికి రాజులూ, మంత్రులు చేసిన మంత్రాంగమే రాజకీయం.

ఈ రోజుల్లో అధికార పీఠం మీద కూర్చోడానికి కొన్ని సమూహాలు(పార్టీలు ) చేస్తున్న కుతంత్రమే రాజకీయం.

అప్పుడైనా ఇప్పుడైనా రాజకీయం యెక్క అంతిమ లక్ష్యం ఒక్కటే అధికారం.

ఎక్కువమంది ఉన్న సామాన్య ప్రజలకు ఎంగిలి మెతుకులు విసిరి, తక్కువ మంది ఉన్నా రాజకీయనాయకులు విందుభోజనాలు చేయటమే రాజకీయం.

అదేంది రాజకీయమంటే '' (ప్ర)ప్యజా సేవ“ కదా అంటారేమో.

అవును నిజమే రాజకీయమంటే '' (ప్ర)ప్యజా సేవే “ . కాదని ఎవరు అన్నారు, కాకపోతే ప్రజలకి రాజకీయనాయకులు చేసే సేవ కాదు. రాజకీయనాయకులకు ప్రజలు సేవ చేయటమే అసలైన (ప్ర)ప్యజా సేవ. ఎందుకంటే వాళ్ళు యజమానులు మనం పనివాళ్ళం.ఈ నిజాన్ని తెలుసుకో ఒక మంచి పని వాడుగా మసులుకో.

ఇన్ని నిజాలు తెలిసినాక వాడిని కడగకుండా ఉండనంటావా సరే నీ ఇష్టం.నువ్వు ఎంత కడిగిన వాడు నిన్ను ఏమి అనడు. ఎందుకంటావా అసలే నువ్వు ఉచితముగా సేవ చేస్తున్న పని వాడివి కదా, నిన్నుతీసేస్తే వాడి పని వాడే చేసుకోవాలి అంటే వాడు కూడా పని వాడై పోతాడు. రాజకీయ మేధావులెవ్వరు అలాంటి తప్పు చేయరు. కాకపోతే మనమే చేసిన తప్పునే మళ్ళి మళ్ళి చేస్తుంటాం మళ్ళి మళ్ళి వాడి దగ్గరే పని చేస్తుంటాం ఎంతయినా మనకి నిజాయితీ ఎక్కువ కదా!

ఈ జన్మకి ఇలా సరిపెట్టుకుందాం, కనీసం వచ్చే జన్మలోనైనా రాజకీయనాయకుడిగా పుట్టాలని కోరుకుందాం.

సామాన్యులకి లేని ప్రత్యేక సదుపాయాలు ఈ రాజకీయనాయకులకు ఎందుకు? వీళ్లంతా మహా మేధావులనా ?

మేధావులే కాబోలు, ఐన వీళ్ళ మేధావితనం ముందు మనమెంత.

వీళ్ళూ తండ్రి కొడుకులను ,అమ్మ కూతురులను విడదీయగల మేధావులు.మతం పేరు చెప్పో,కులం పేరో చెప్పో,ప్రాంతం పేరు చెప్పో,ధనికుడు లేదా పేదవాడు అని చెప్పో విభజించగలరు.ఇంకా ఇవేమీ పారకపోతే జాతి లేదా దేశం అనో చివరి అస్త్రం గా ప్రయోగిస్తారు.ఇన్ని అస్త్రాలు నీ బుర్రలో ఉన్నాయా చెప్పు? ఉంటె చెప్పు ఇప్పుడే నీకు కల్పిస్తాం ఈ సదుపాయాలన్నీ. లేవుకదా మరి వీరికి గాక మనం ఎవరికీ కల్పించాలి. ఆ బుర్రలను రక్షించి ముందుతరాలకు కూడా అందించాలి లేక పొతే దేశం ఎంతో నష్టపోతోంది. సుమా!.

వీళ్లు ఎంత నిస్వార్ధ పరులంటే,

వీళ్ళకి శిలా ఫలకాల్లో కి ఎక్కాలన్న తపన తప్ప ప్రజల మనః ఫలకాల్లోకి ఎక్కాలన్న దురాశ అసలే ఉండదు.

వీళ్ళు ఎంతటి న్యాయమూర్తులంటే,

న్యాయస్థానాల తీర్పులను కూడా విశ్లేషించి దోషులను నిర్దోషులుగా , నిర్దోషులను దోషులుగా తేల్చ గల మహానుభావులు.పాపం ఏమి చేస్తాం న్యాయ దేవతకు కళ్ళు ఉండవుగదా ఎవరు గట్టిగా అరచి చెప్తే వారిదే వినపడుతుంది.వాళ్ళతో పోటా పోటీగ అరవాలంటే చినప్పుడే మనం 'లౌడ్ స్పీకర్లు' లాంటివి మింగాలేమో.ఆ ఒక వేళ మింగిన అరాయించుకొనే శక్తి మనకెక్కడుంది.

వాళ్లంటే గడ్డి నుంచి కంటికి కనబడని తరంగాలను కూడా మింగి అరాయించుకోగల భోక్తలు.

ఈ రాజకీయనాయకులకు ఎన్నికలప్పుడు పేదలు గుర్తొస్తారు ఓట్ల కోసం, ఎన్నికలు అయిపోయినాక ధనికులు గుర్తొస్తారు నోట్ల కోసం.కానీ అన్ని సందర్భాలలోనూ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. వీళ్లు తప్పో ఒప్పో, ఒక వైపు నిలబడరు నిలబడలేరు , ఒక మాట మీద నిలబడరు నిలబడలేరు . ఏ పూటకు ఆ పాటే.ఆలా అని వరం ఉందనుకుంటా.

వీళ్ళకి దేవుడు ఇంకొక వరం కూడా ఇచ్చాడేమో. ఎవడైనా నిజాయితీగా ప్రజా సేవ చేస్తున్నాడు అనుకోండి (ఆ ఈ రోజుల్లో ఎవడు చేస్తున్నాడులే అంటారా సరే కానివ్వండి ఈ ఒక్క సారికి అనుకొందాములే ), వాడు చేసే సేవలో లోపాలు వెతికి పట్టుకోవటం లో వీళ్ళ అంత మేధావులు లేరు. పట్టుకొని అంతటి తో వదిలేస్తే పరవాలేదు ,ఆ లోపాలు సరిచేయగల మొనగాళ్ళం మేమే నంటూ "బాకా" ఊది "డప్పు" కొడతారు. డప్పు కొట్టినాక మనం ఊరుకుంటామా, యదావిధిగా డప్పు నృత్యానికి చెలరేగి నాట్యమాడే పరమ శివుడిలా అధికార వరాన్ని ఓటు తో కొట్టి మరీ ఇస్తాం. ఇక ఆ తరువాత (ప్ర)ప్యజా సేవ ఏమో కానీ ఆ 'భస్మాసుర హస్తాల'నితప్పించుకోవడానికి మనం పలాయన మంత్రం జపించ వలసిందే.ఆ పరమశివుడి ని ప్రమాదం నుంచి తప్పించడానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు.కానీ మన ప్రమాదాలు తప్పించడానికి ఎవరిని మోహిని అవతారం కూడా ఎత్తనియకుండా నిషేదించగల చట్టాలు చేయగల మేధావులు మన నాయకులు.

వెనకటికిఎవరోఅన్నారు రాజకీయమనేది అతి పురాతనమైన రెండవ వృత్తి అని, దీనికి ఆ మొదటి వృత్తికి చాల దగ్గరసంబంధాలుఉన్నాయి అని.

ఇంతకీ ఆ మొదటి వృత్తి ఏంటి? అని అడుగుతారా, అదే వ్యభిచారం.

కానీ నేటి మనరాజకీయనాయకులు దేనిలోనైన ముందుఉండాలి అని అనుకుంటారుకదా. అందుకే ఆమొదటి వృత్తిని కూడాకలుపోకొని చేస్తున్నారు రాజకీయవ్యభిచారం.

-- దావినేని నరేంద్రనాథ్