//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసలు జి.ఎస్.టి అంటే ఏమిటి?

Category : national state business gst

జి.ఎస్.టి, జి.ఎస్.టి, జి.ఎస్.టి ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే చర్చ జి.ఎస్.టి
అసలు జి.ఎస్.టి అంటే ఏమిటి? దాని వల్ల మనకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి? దానిని ఎలా వసూలు చేస్తారు?

ముందుగా అసలు పన్నులు అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వానికైనా మనుగడ అనేది ప్రజలపై విధించిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తోనే ఉంటుంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు , రోడ్లు, రైళ్ళు లాంటి మౌలిక వసతులు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలు , ముందుతరాలకు ఉపయోగపడే పరిశోధనలు, అత్యవసర పరిస్తితులలో ఉపయోగించుకోవడానికి వస్తువుల నిల్వలు ఇంకా ఎన్నెన్నో... దేనికైనా ప్రభుత్వాలు పన్ను విధించడం అనేది మనకు పూర్వపు రాజుల కాలం నుండి నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల వరకు సర్వసాధారణం. మన దేశంలో ఉన్న సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగం కల్పించిన హక్కులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పన్నులు విడివిడిగా విధించడం మనకు తెలిసిందే.

అందులో కొన్ని
కేంద్ర ప్రభుత్వ పన్నులు
కేంద్ర ఎక్సైజ్ సుంకం,
ఇతర మరియు అదనపు ఎక్సైజ్ సుంకాలు,
సేవా పన్నులు,
ఇతర సర్ చార్జీలు, సెస్సులు,
కస్టమ్స్ సుంకాలు,

రాష్ట్రం ప్రభుత్వ పన్నులు
విలువ ఆధారిత పన్ను(వాట్),
ప్రవేశ సుంకం,
వినోద మరియు ఉల్లాస సుంకం(స్థానిక సంస్థలు),
కొనుగోలు సుంకం (సేల్స్ టాక్స్),
ప్రకటనల పన్నులు,
మొదలగునవి.


ఎవరు ఎన్ని పన్నులు విధించిన అంతిమంగా చివరికి వినియోగదారుడే ఈ పన్నులన్నీ
భరించవలసింది. కానీ ఇప్పుడున్న నానారకాల పన్నుల వ్యవస్థ వలన వినియోగదారుడు చెల్లించిన పన్నులు అన్నీ ప్రభుత్వానికి చేరడం లేదు. వీటికి కారణం కొంతమంది వ్యాపారులలో ఉన్న దురాశ కావచ్చు. అలాగే కొన్ని సార్లు మధ్యలో ఉన్న వ్యాపారులకి రావాల్సిన పన్ను చెల్లింపులు సరిగా అమలు అవడంలేదు. దీనికి ప్రభుత్వ వ్యవస్థ లో ఉన్న అలసత్వం ఒక కారణం.

ఇంతే కాకుండా ఒకే దేశంలోఒక వస్తువు మీద ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం పన్ను. అంతా పెద్ద గందరగోళం. దీనివలన మనదేశంలో వ్యాపారం చేయటమంటే అదోపెద్ద ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం లాంటిది. ఈ లోపాలను సరిచేయడానికి భారత ప్రభుత్వం రాజ్యాంగసవరణ ద్వారా దేశమంతటికీ ఒకేలా వర్తించే వస్తుసేవల పన్ను విధానము (చట్టం) తిసుకువచ్చింది.
దీని వలన దేశమంతా ఒకే మార్కెట్ పరిధిలోనికి వస్తుంది. అలాగే వస్తువు అంతిమ వినియోగం ఎక్కడ జరుగుతుందో ఆ రాష్ట్రానికి మాత్రమే పన్ను లభిస్తుంది (కేంద్రానికి దాని
వాటా దానికి వస్తుందనుకోండి). అందుకే దీనిని గమ్య ఆధారిత పన్ను అని చెప్పవచ్చును.

ఉదాహరణకు ఒక వస్తువు మహారాష్ట్ర లో ఉత్పత్తి జరిగి అనేక మంది డీలర్ల చేతులు మారి (పన్నులు చెల్లించినాక) ఆంధ్రప్రదేశ్ లోని వినియోగదారునికి చేరితే దానిపై ఉన్న పన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చేరుతుంది. వివిధ దశలలో డీలర్లు చెల్లించిన పన్నును తిరిగి వారిఖాతాకి ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్(ITC) రూపం లో జమచేస్తుంది. ఈ లావాదేవీలు ప్రభుత్వ మరియు ప్రైవేటు బాగస్వామ్యం లో ఉన్న జి.ఎస్.టి నెట్ వర్క్ (GSTN) అనే ఉమ్మడిసంస్థ పర్యవేక్షిస్తుంది. ఇది పూర్తిగా అంతర్జాల ఆధారిత వ్యవస్థ ద్వారా నడుస్తుంది.

దీనివలన పారదర్శకత పెరగడంతో పాటు పన్నులు తగ్గి (అధికశాతం వస్తువుల) వస్తు సేవల ధరలు అందుబాటులోకి వస్తాయి. అంతిమంగా కొనుగోళ్ళు పెరిగి ఇటు వ్యాపారులకు ప్రభుత్వానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా తాము చెల్లించిన పన్నులు
ప్రభుత్వానికి చేరుతున్నాయన్న భరోసా కలుగుతుంది. ఏ నూతన విధానం ప్రారంభించిన మొదట్లో కొన్ని తడబాట్లు తప్పవు, కానీ రానున్న రోజుల్లో దీని వలన కలిగే సత్ఫలితాలను అందరూ అందుకుంటారు.

రేపు వివిధ రకాల జి.ఎస్.టి మరియు వాటిని ఎప్పుడు ఎలా వసూలుచేస్తారు అనేది తెలుసుకుందాం.

జి.ఎస్.టి గురించి మరిన్ని వివరాలు,విశ్లేషణల www.gstreporting.com వారి సౌజన్యంతో మీకు అందిస్తోంది మీ INS Media.మరింత సమాచారం కోసం ఇక్కడ https://www.ins.media/gst క్లిక్ చేయండి.