Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేఏ పాల్ ఆ పనీ చేస్తున్నారు .. ఏంటో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

Category : politics

ఏపీ రాజకీయాల్లో ఊహించని విధంగా వచ్చి మా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసుకునే కె పాల్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.పదేళ్ల కిందటే చాలా హడావుడి చేస్తున్నాయని తనకు అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్నాయని.. అప్పట్లో బుష్ - సోనియాలు కూడా తన మాటను కాదనలేరని.. ఇలా ఏదేదో మాట్లాడాడు. అలా మాట్లాడటంతో అతడిని ఒక కమేడియన్ లాగా చూశారు జనాలు. చివరకు అతడు కమేడియనే అని నిరూపించుకొంటూ వస్తున్నాడు.

అప్పట్లో తనకు వ్యతిరేకంగా బుష్ కుట్ర చేశాడు - కండోలిజా రైస్ కుట్ర చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్ర చేశాడని అంటూ నానా కంగాళీ చేశాడితను. ఆ తర్వాత పాల్ ను మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడితను. ఒక హత్య కేసులో కూడా అభియోగాలు ఎదుర్కొన్నాడు. పూర్తి వివాదాస్పదుడు అయ్యాడు. తీరా గత ఎన్నికల ముందు మళ్లీ వచ్చాడు. తన ప్రజా శాంతిపార్టీ అంతటా పోటీ చేస్తుందని ప్రకటించాడు. తీరా ఎన్నికల సమయం వచ్చాకా చేతులు ఎత్తేశాడు. అదేమంటే… అప్పట్లో తన లాప్ టాప్ పోయిందని - అందులో కీలకమైన వివరాలు ఉండేవని.. అది పోవడంతో తను పార్టీపోటీ చేయలేకపోయినట్టుగా చెప్పుకున్నాడు. యథారీతిన కామెడీ చేశాడు.

ఇక ఇప్పుడు మళ్లీ టీవీ చానళ్లలో కేఏ పాల్ కామెడీ కొనసాగుతూ ఉంది. ఇతడు ఈ సారి కూడా పాత హడావుడే చేస్తున్నాడు. ‘ఒక్కో నియోజకవర్గానికి కోట్ల రూపాయలను ఇవ్వగలను..’ అని చెప్పుకుంటున్నాడు. ఈ మాటలు వింటూ జనాలు నవ్వుకుంటున్నారు. టీవీ చానళ్లు కూడా ఈయన చెప్పే సెన్సేషనల్ కామెడీ వినడానికి ఈయనను చర్చల్లో కూర్చో పెడుతూ ఉంటాయి. ఇక తాజాగా కేఏ పాల్ తన దగ్గరకు వచ్చిన వాడిని చందాల అడుగుతున్నాడట. ప్రపంచాన్ని శాసిస్తాం అని చెప్పే కెఏ పాల్ ఏ విధంగా చందాలు అడగడంతో పాల్ దగ్గరకు వచ్చే వాళ్ళు షాక్ తింటున్నారట. అయితే ఆయన గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇదంతా మామూలే. ఎప్పుడు జరిగే రొటీన్ అని నవ్వుకుంటున్నారు.