//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల్లో టీజేఎస్ పరిస్థితి అదేనా ... కోదండరాం కు మిగిలింది ఇదేనా

Category : politics state

ఆయన తెలంగాణా ఉద్యమ వ్యూహకర్త. మేధావులను, విద్యావంతులను ఉద్యమం వైపు నడిపించిన ప్రొఫెసర్ . అయితే ఆయన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం తో విబేధించి కొత్త పార్టీ పెట్టారు. తెలంగాణ లో గత ఏడాదిన్నర రెండేళ్లు గా ఇటు రాజకీయ పార్టీలు....అటు తెలంగాణవాదులు ఆసక్తికరం గా గమనించిన ఆ వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలుసు ఆయనే రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం .

తెలంగాణ ఉద్యమం లో రాజకీయ పార్టీలకు అతీతంగా క్రియాశీలంగా వ్యవహరించిన ప్రొఫెసర్ అనంతరం ఏం జరిగిందో తెలీదు కానీ టీఆర్ ఎస్ సర్కారుకు వ్యతిరేక జెండా ఎగురవేసి తనదైన శైలిలో పోరుబాట పట్టారు. అనంతరం తెలంగాణ జనసమితి పేరు తో ఓ పార్టీ ఏర్పాటు చేసిన ఆయన ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారు. అయితే మహాకూటమి పొత్తులతో పోటీ చెయ్యాలనుకున్న కోదండ రాం పార్టీ కి ఆది నుండీ అన్నీ అవాంతరాలే . ఇక టికెట్లు కూడా ఆశించినవి దక్కక టీజేఎస్ ఆశలు ఆశలు అడియాసలయ్యాయని చర్చ జరుగుతోంది. తాజా గా జరిగిన ఎన్నికల్లో పొత్తు పర్వం,సీట్ల కేటాయింపు,పోలింగ్ సరళి చూస్తుంటే ఇది స్పష్టమవుతోందంటున్నారు.

టీఆర్ఎస్ వ్యతిరేకతే ప్రధాన అజెండా గా ఉద్యమ నేపథ్యమే అండగా తెలంగాణ జనసమితిని కోదండరాం ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రజా క్షేత్రం లో మద్దతు కూడగడుతున్నాడు. అసలు మొదట ఒంటరి గా పోటీ చేస్తామన్న కోదండరాం అనంతరం కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ తో ప్రజాకూటమి లో జట్టుకట్టారు. పొత్తులో భాగంగా ఆ పార్టీ రాష్ట్రం లో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగింది. వీటి లో నాలుగు అంబర్ పేట నుండి నిజ్జన రమేష్, మల్కాజిగిరి నుండి దిలీప్ కుమార్, సిద్దిపేట నుండి భవానీ రెడ్డి, వర్దన్నపేట నుండి దేవయ్య స్థానాల్లో సొంతంగా బరిలోకి దిగారు . మిగిలిన ఐదు దుబ్బాక నుండి రాజ్ కుమార్, వరంగల్ తూర్పు నుండి గాదె ఇన్నయ్య, ఆసిఫాబాద్ నుండి ఆత్రం సక్కు,మిర్యాలగూడ నుండి విద్యాధర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి రాజేందర్ రెడ్డి స్థానాల్లో కాంగ్రెస్ తో కలిసి `స్నేహపూర్వక` బరిలో నిలిచింది. ఈ పోటీ దశలోనే రకరకాల చర్చలు వినిపించాయి. ఎనిమిది స్థానాలు ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని టీజేఎస్ నేతలే వాపోయారు. తాము 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే నాలుగింటి లో సొంతంగానూ,మిగిలిన ఐదింటిలో కాంగ్రెస్ తో కలిసి స్నేహపూర్వక బరిలో నిలవాల్సి వచ్చిందని అంటున్నారు.కాంగ్రెస్ తమను మోసిం చేసిందని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. కానీ లాస్ట్ మినిట్ వరకు అధినేత ఎటూ తెల్చుకోకపోవటం తో ప్రచారం లో వెనుకపడ్డామని భావించి విధి లేక కూటమిలో కొనసాగారు.

ఈ విమర్శల సంగతి అటుంచితే శుక్రవారం ఎన్నికలు ముగియడంతో మొత్తం స్థానాల్లో ఎంత మంది అభ్యర్థులు విజయం సాధిస్తారోనని ఆ పార్టీ లెక్కల్లో మునిగింది. కానీ పరిస్థితి ఎంత మాత్రం ఆశాజనకంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వచ్చే ఐదేళ్లు మనుగడ సాగించాలంటే ఆ పార్టీ అభ్యర్థులు కనీసం నాలు గైదు స్థానాల్లో గెలవడం తప్పనిసరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎక్కడా వారికి అనుకూల ఫలితాలు వచ్చే దాఖలాలు కనిపించటం లేదు. ప్రస్తుత తరుణంలో కోదండరాం ఫలితాల కోసం నిరీక్షిస్తూ భవిష్యత్ గురించి ఆశావాహ దృక్పథంతో ఉండటం తప్ప చేసేది ఏమీ లేదని తేల్చేస్తున్నారు రాజకీయ వర్గాలు. మొత్తానికి కోదండరాం కి ఇక ఇప్పుడు మిగిలింది ఇదే అనే చర్చ జోరుగా సాగుతుంది.

Related News