Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆంద్రప్రదేశ్ కు కొత్తగా నియమించిన రాష్ట్ర గవర్నర్ కు ఘనస్వాగతం

Category : politics state

తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంద్రప్రదేశ్ కు కొత్తగా నియమించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరి చందన్ వారి కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం 11.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం లో ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త, నగర పాలక కమిషనర్ పి.ఎస్.గిరీషా, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఇఓ బసంత్ కుమార్, మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి, వెస్ట్ డి ఎఫ్ ఓ సునీల్ కుమార్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, తిరుపతి ఆర్.డి.ఓ.కనక నరసా రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ విజయసింహా రెడ్డి,

సెట్విన్ సి.ఇ. ఓ. లక్ష్మీ,బిజెపి నాయకులు కోలాఆనంద్ స్వాగతం పలుకగా డీఎస్పీ లు చంద్రశేఖర్, సాయి గిరిధర్ , సిఐ అంజు యాదవ్, రెవెన్యూ డిటీలు ఈశ్వర్, శ్యాంప్రసాద్ , ఇతర అధికారులు ఏర్పాట్లు పర్వవేక్షించారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరారు. శ్రీవారిని దర్షించుకుని మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారి దర్షించుకుని 3.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు.