Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం.

Category : state politics

రేణిగుంట, జూలై 13: శనివారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. గౌ.భారత రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి రాష్ట్ర గవర్నర్ రానున్న విషయం తెలిసినదే. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. భరత్ గుప్త, టీటీడీ జేఈవో బసంత్ కుమార్ , జెసి మార్కొంకొండేయులు, తిరుపతి సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్,

తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ , రేణిగుంట తాసిల్దార్ విజయసింహారెడ్డి, ఏర్పేడు తాసిల్దార్ సుబ్బన్న , అడిషనల్ ఎస్.పి.అనీల్ కుమార్, రేనిగుంట డిఎస్పీ చంద్రశేఖర్, రాష్ట్ర గవర్నర్ వారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ రాక ఏర్పాట్లను పర్యవేక్షించిన రెవెన్యూ అధికారులు ఈశ్వర్, శ్యాం ప్రసాద్ ,తదితరులు ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న నిమిత్తం బయలుదేరిన రాష్ట్ర గవర్నర్ దంపతులు.