//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుర్ఖాల్యాండ్ నేత ఇంటినుండి `ఆయుధాల' పట్టివేత

Category : national

పశ్చిమ బెంగాల్ లోని పర్వత ప్రాంతం గుర్ఖాల్యాండ్ లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న కార్యాలయాల బంద్ గురువారం తీవ్ర రూపం దాల్చించి. నిరవధిక బంద్ కు గుర్ఖా జనముక్తి మోర్చా పిలుపిచ్చింది, 

పోలీస్ లు గురువారం ఉదయం మోర్చా అధినేత బిమల్ గురుంగ్ కార్యాలయంగా ఉపయోగించు కొంటున్న ఇంటిపై దాడి చేసి బాణాలు, విల్లు తుపాకులు, బాకులు, ప్రేలుడు పదార్ధాల వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీస్ ల అరాచకానికి నిరసనగా నిరవధిక బంద్ జరుపుతామని మోర్చా నాయకుడు బినోయ్ తమంగ్ ప్రకటించారు. 

సాంప్రదాయక పోటీలకు ఉపయోగించే వాటిని చూపుతూ పోలీస్ లు అసత్య ప్రచారానికి దిగుతున్నారని మోర్చా నాయకులు విమర్శించారు. గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ బుధవారం నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ తో తమ పొత్తుకు తిలోదకాలిచ్చి మోర్చా తో చేతులు కలపడంతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. 

పర్వత ప్రాంతంలో గత నాలుగు రోజులుగా పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో చాలామంది పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేసి వెళ్లి పోయారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగా పర్యాటకులు ఎవ్వరూ డార్జ్లింగ్ కు రావద్దని గురుంగ్ విజ్ఞప్తి చేశారు. 

పశ్చిమ బెంగాల్ పోలీస్ లకు సహకరించడానికి కేంద్రం 600 మంది సాయుధులను పంపింది. గత వారం పర్వతప్రాంతం పాఠశాలలో బెంగాలీ భాషను రుద్దడాన్ని నిరసిస్తూ ఆందోళల చేబడుతున్న సందర్భంగా పోలీస్ లతో ఏర్పడిన ఘర్షణ ప్రస్తుత ఆందోళనకు దారితీసింది. దానితో కొంతకాలంగా మరుగున పడిన ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తెరపైకి వచ్చింది.