//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తాం ; మోడీ

Category : politics

ప్రధాని మోదీతో భేటీ అయిన వివరాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏపీకి న్యాయం చేస్తాం తొందరపడవద్దని సుజనాకు మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం. మోదీతో భేటీ తర్వాత చంద్రబాబుకు ఫోన్ చేసి సుజనా చౌదరి వివరాలు తెలియజేశారు.

ఏపీలో పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను మోదీకి వివరించానని ఆయన చెప్పారు. అవసరమైతే చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడతానని మోదీ చెప్పినట్లు తెలియవచ్చింది. ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని, న్యాయం చేస్తామని, ఏ విషయంలోనూ తొందరపడవద్దని సుజనాకు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఏపీలో ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా కూడా ఒక మార్గం వెతుకుతామని ప్రధాని సుజనా చౌదరితో చెప్పినట్లు తెలియవచ్చింది. ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తామని, అన్యాయం చేయబోమని మోదీ చెప్పినట్లుగా సమాచారం.

ప్రధాని మోదీతో కేంద్రమంత్రి సుజనాచౌదరి మంగళవారం సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు మోదీతో చర్చించారు. విభజన హామీలతోపాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.