//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'పవన్ దేనికి భయపడుతున్నారో అర్థం కావడంలేదు'

Category : state politics movies

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేనికి భయపడుతున్నారో అర్థం కాని పరిస్థితి అని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తనపై ఏదో కుట్ర జరుగుతోందని... అందులో భాగంగా నటి శ్రీరెడ్డితో ఆ మాట అనిపించారని.. ఇవన్నీ ఊహించుకుంటూ... ఏబీఎన్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం, టీట్లు చేస్తున్నారని ఏబీఎన్ ఆరోపించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చిన ఆయన ఈ రకమైన నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ఏబీఎన్ ప్రశ్నించింది.

ఇదే అంశంపై ఏబీఎన్ నిర్వహించిన డిబేట్‌లో ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కె. శ్రీనివారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులు రెచ్చగొడుతున్నారని అంటున్నారని, అది సరికాదని, బీజేపీనే నేర్పిందని అన్నారు. బీజేపీకి... తాముకు నచ్చని వారిపై దాడులు చేయడం, మతత్వంతో మహాత్మా గాంధీనే హత్య చేశారని ఆయన అన్నారు. హేతువాదాన్ని హత్య చేస్తున్నారని శ్రీనివారెడ్డి విమర్శించారు.

దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ... మీడియా స్వేచ్ఛను నియంత్రించకూడదని అన్నారు. మీడియా విధుల్లో రాజకీయపక్షాల జోక్యం సరికాదని ఆయన చెప్పారు. నిరాధార వార్తలపై కోర్టుల ద్వారా తేల్చుకోవాలని సూచించారు. మీడియాపై భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం సరికాదన్నారు. సినిమా, మీడియా, రాజకీయాల మధ్య హద్దులు చెరిగిపోయాయని అమర్ పేర్కొన్నారు.