//single page style gallary page

We are making all efforts to protect RTC from losses Minister of Transport and Information Perni Venkatramaiah

Category : politics

Click here to read this article in Telugu

ఆర్టీసీని నష్టాల నుండి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: రవాణా,సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

అమరావతి, విశ్వం వాయిస్ బ్యూరో న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను నష్టాల నుండి కాపాడేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతోందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య వెల్లడించారు. సోమవారం సచివాలయం రెండవ భవనంలో రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన 2019 బడ్జెట్ అంచనాలపై శాఖలవారీగా జరిగిన సమావేశంలో రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖలకు సంబంధించిన జరిగిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పేర్ని వెంకట్రామయ్య మీడియాతో మాట్లాడుతూ... ఆర్టీసిని నష్టాల నుండి గట్టెక్కించాలంటే సుమారు 6 వేల 900 కోట్ల రూ.లు అవసరం ఉంటుందని,

ఈ నష్టాల నుండి ఆర్టీసీని గట్టెక్కించాలని ఆర్థిక మంత్రికి విజ్ణప్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యనిధికి సంబంధించిన 3వేల కోట్ల రూ.లను నేరుగా వాడేశారని, ఉద్యోగులకు పెంచిన వేతన సవరణ బకాయిలు ఇంతవరకూ చెల్లించలేదని పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే విధంగా ఆర్టీసిని గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.అదే విధంగా రవాణాశాఖలో సుమారు 100 ఖాళీలను తక్షణం భర్తీ చేయాల్సి ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికమంత్రిని కోరామని మంత్రి వెంకట్రామయ్య వెల్లడించారు.

అలాగే సమాచార పౌరసంబంధాల శాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రికి సమర్పించామని చెప్పారు. బుధవారం మరొకసారి సమావేశం అవుదామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సూచించారని, ఆ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక,రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, కృష్ణబాబు, ఆర్టీసి ఎండి సురేంద్ర బాబు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ కుమార్ రెడ్డి, అదనపు సంచాలకులు శ్రీనివాస్, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Amaravathi , Vishwam Voice Bureau News: All efforts are being made to save Andhra Pradesh Road Transport Corporation (RTC) from damage, State Information Communications and Transport Minister Venkatramaiah said. On Monday, the Secretariat of the second building of the state budget for 2019 on the expectations of the chairmanship of the Finance Minister buggana rajendranadh No meeting sakhalavariga transportation, PUBLIC RELATION departments involved in the review of the minister. Speaking to the media after the minister names VENKATRAMAIAH ... RTC losses of about 6 thousand 900 crore rulu gattekkincalante required,

The Finance Minister has been apprised of the loss of the RTC. He said that the previous government had used Rs 3 crore crores directly related to the futures of RTC employees and that the salary revision dues raised by the employees had not been paid yet. "All efforts are being made to find the RTC in order to overcome all these difficulties," the minister said, adding that about 100 vacancies in the transport sector should be filled immediately and urged the finance minister to take appropriate action.

He also said that the budget proposals for the Department of Information and Communications were submitted to the finance minister. Avudamani another meeting on Wednesday, Finance Minister buggana rajendranadh Reddy suggested to the minister that the meeting will discuss various aspects of the names VENKATRAMAIAH teliparui review meeting, the chief secretaries of the Departments of Transportation SS Rawat , Krishna, artisi MD Surendra Babu , Finance kesatyanarayana Special Secretary, Department of Information Technology Commissioner T. Vijaya Kumar Reddy, Napulanka Srinivas and other relevant officials were involved.