Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో అందుబాటులోకి జల విమానాశ్రయాలు!

Posted 3 months ago | Category : national

అనువైన ప్రాంతాల కోసం కేంద్రం అన్వేషణ

దేశవ్యాప్తంగా ప్రజలకు విమానయానాన్ని మరింతగా చేరవేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 'ఉడాన్‌' పథకంతో ఇప్పటికే ప్రాంతీయ అనుసంధానతను పెంచడంతోపాటు విమాన ప్రయాణాన్ని సాధారణ జనానికీ అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా జల విమానాశ్రయాల(వాటర్‌డ్రోమ్‌లు) నిర్మాణంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా సముద్ర విమానాలను నడిపేందుకు అనువైన ప్రదేశాల అన్వేషణ మొదలుపెట్టింది.

నీటిపై నుంచి గాల్లోకి ఎగిరి(టేకాఫ్‌)..

తిరిగి నీటిపై దిగేందుకు(ల్యాండింగ్‌) అనువుగా ఉన్న విమానాలను 'సముద్ర విమానాలు' అంటారు. ఇవి టేకాఫ్‌, ల్యాండింగ్‌ వంటి ప్రక్రియలు పూర్తిచేసుకునేందుకు అవసరమైన కనీస నీటిమట్టం వంటి సదుపాయాలున్న ప్రాంతాలను సముద్ర విమానాశ్రయాలు అంటారు. ప్రస్తుతం మనదేశంలో ఈ తరహా విమానాశ్రయాలు పెద్దగా అందుబాటులో లేవు. హెలికాప్టర్‌ సేవల సంస్థ 'పవన్‌ హన్స్‌' మాత్రం గతంలో అండమాన్‌ ప్రాంతంలో సముద్ర విమానాలను నడిపింది.ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఉడాన్‌' పథకంలో భాగంగా ప్రభుత్వం సముద్ర విమానాల సేవలకూ అనుమతించడంతో.. దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో వీటి నిర్వహణపై కొన్ని సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జల విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించడంపై ప్రభుత్వం దృష్టిసారించినట్లు పౌర విమానయానశాఖ సీనియర్‌ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ), పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ), పౌర విమానయాన శాఖ అధికారులతో కూడిన సంయుక్త బృందం ఈ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని తెలిపారు.దేశవ్యాప్తంగా 16-20 ప్రాంతాలుఈ విమానాశ్రయాల ఏర్పాటుకు అనువైనవనే సూచనలు ఇప్పటికే వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వ బృందం వాటిని పరిశీలించి.. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించే అవకాశముందని వివరించారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి