Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వారెన్ బఫెట్ తో కలిసి లంచ్ విలువ రూ.17 కోట్లు

Category : world

వారెన్ బఫెట్ ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ ది నాలుగో ప్లేస్. ఆయన కు స్మార్ట్ ఇన్వెస్టర్ అని కూడా పేరుంది. ఎందరికో ఆయన మార్గదర్శకుడు. అలాంటి మార్గదర్శకుడితో కాసేపు ముచ్చటించే అవకాశం దొరకడం అదృష్టమే. ఇక భోజనం చేస్తూ మాట్లాడటం అంటే.. ఎంతో గొప్ప. అయితే.. ఆయనతో కలిసి లంచ్ చేయాలనుకుంటే మాత్రం దాదాపు రూ.17 కోట్ల దాకా కట్టాలట.వారెన్ బఫెట్ తో లంచ్ చేయడానికి రూ.17.25 కోట్లకు పైగా చెల్లించి మరీ సిద్ధమయ్యాడు ఓ వ్యక్తి. ఆయన వివరాలు మాత్రం వెల్లడించలేదు. వారెన్ బఫెట్ తో లంచ్ కోసం బిడ్ వేయగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బిడ్ ను రూ.17కోట్లకు దక్కించుకున్నాడు. కాగా, ఈ డబ్బును గ్లైడ్ ఫౌండేషన్ అనే చారిటీ సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారట వారెన్ బఫెట్. 2004 లో తన మొదటి భార్య చనిపోయిన తర్వాత ఈ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తున్నారు బఫెట్. గతేడాది బఫెట్ లంచ్ కోసం బిడ్ వేయగా.. 22 కోట్ల రూపాయలకు పైగానే పలికింది.

Related News