సౌత్ ఆఫ్రికా , ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ లో ఆటగాళ్ళ స్లెడ్జింగ్ తీవ్ర స్థాయికి చేరింది. తమను రెచ్చగొట్టిన సఫారి బౌలర్ పై ఆసిస్ ఆటగాళ్ళు కసి తీర్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రబాడ బౌలింగ్ ని ఊచకోత కోసాడు.
గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 311 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ఈ క్రమంలో రెండు టెస్టుల్లో ఆసీస్ పతనాన్ని శాసించిన దక్షిణాఫ్రికా పేసర్ రబడపై వార్నర్విరుచుకుపడ్డాడు.తాను ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను బౌండరికీ తరలించి టి20 అనే అనుమానం కలిగించాడు.
రబడా వేసిన నాలుగో ఓవర్ చివరి మూడు బంతులను బౌండరీలకు పంపించిన వార్నర్.. ఆరో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టాడు. రెండో బంతిని రబడా నోబాల్ వేయగా ఆ బంతిని కూడా బౌండరీకి తరలించాడు. అయితే ఆ వెంటనే రబడ వార్నర్‌ను బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీనితో వీరి మధ్య ఏ స్థాయి యుద్ధం ఉందో స్పష్టంగా అభిమానులకు అర్ధమైంది.