//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వార్ వన్ సైడే

Category : politics

వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో వార్ వన్ సైడే అని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆమె సచివాలయంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడారు.

అన్ని పార్టీ లు కలిసి పోటీ చేసినా మాకే లాభం అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని తప్పకుండా ఢిల్లీకి తీసుకువెళ్తామన్నారు. కేబినెట్లో మహిళా మంత్రి లేకపోయినా మహిళలకోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు చూస్తున్నారని కవిత అన్నారు. గతంలో ఆరుగురు మహిళా మంత్రులు ఉన్నప్పుడు చేయాలేనిది ఒక్క కేసీఆర్ చేస్తున్నారని ఆమె అన్నారు. అసెంబ్లీలో సమయం ఇస్తే రెండు నిమిషాలు మాట్లాడలేనివారు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనడం విచిత్రంగా ఉందన్నారు.

ఒంటెరు ప్రతాపరెడ్డికి అపోహలు అవసరం లేదని, కేసీఆర్‌కు కక్షలు ఉండవన్నారు. టీఆర్ఎస్‌లో క్రమశిక్షణ ఉంది. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ఆహ్వానం వస్తేనే కేటీఆర్ దావోస్ వెళ్లారన్నారు. టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని కవిత పేర్కొన్నారు

Related News