కిమ్ జాంగ్ ఉన్ ఆద్వర్యంలోని ఉత్తరకొరియా అగ్రరాజ్యమైన అమెరికాతో యుద్దానికి సై అంటుంది. క్షిపణి పరీక్షలను నిర్వహిస్తున్న ఉత్తరకొరియా మాత్రం అమెరికాపై విచక్షణారహితంగా దాడులు నిర్వహిస్తామని హెచ్చరించింది. తాజాగా ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ -2 సంగ్ గౌరవార్థంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాము ఎలా అమెరికాపై దాడిచేస్తామో వివరిస్తూ ఓ వీడియోను ప్రదర్శించింది. ఈ వీడియో ప్రకారం ”పసిఫిక్ సముద్రం మీదుగా అమెరికాపై వరుసపెట్టి ఉత్తర కొరియా క్షిపణులతో దాడిచేస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద బాంబును అమెరికాపై విసురుతుంది. దీనితో అగ్రరాజ్య నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమవుతాయి. చివరగా అమెరికా జెండా కాలిపోయినట్లుగా ఉంటూ దానిపై శవపేటిక ఆకారం కనిపించడంతో వీడియో ముగుస్తుంది. వీడియో ప్రదర్శన అనంతరం ఉత్తరకొరియా మిలిటరీ అధికారులు కరతాళ ధ్వనులు మోగించారు. అది చూసిన అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆనంధంతో అభివాదం చేశారు”.
అయితే దీనికి సంబందించిన వీడియో బయటకు రాలేదు. ఉత్తర కొరియా నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సదుపాయం చాల కొద్దీ మందికే ఉంటుంది. అది కూడా ప్రభుత్వంతో అనుసంధానంలో ఉండటంతో వీడియో బయటకు రాలేదు. అయితే ప్రభుత్వ అధీనంలో ఉన్న టీవీ ఛానళ్లు మాత్రం ఈ వీడియో ప్రసారం చేసినట్లు సమాచారం.అయితే ఇది కొత్తేమీ కాదు. ఇంతకు ముందు 2013, 2016 లోనూ ఇదే తరహాలో అమెరికాలోని నగరాలపై ఎలా దాడిచేస్తారో వివరిస్తూ వీడియోలను విడుదల చేసినది ఉత్తర కొరియా.
ఇది ఇలా ఉంటే ఎప్పుడు ఎలా ప్రవర్తస్తాడో తెలియని ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. తాజాగా ట్రంప్ సిరియా, ఆఫ్గనిస్తాన్ పైన బాంబు దాడి చేయించి తన అనుచిత ప్రవర్తనను మరోమారు చాటుకున్నాడు.