Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పరుశురామ్ కోసం కొట్టుకుంటున్న బడా ఫ్యామిలీస్

Category : movies

పరశు రామ్ టాలీవుడ్ లో ఉన్న చాల మంది డైరెక్టర్స్ లో మనోడు ఒక్కడు .ఇండస్ట్రీ కి వచ్చి పది ఏళ్ళు అవ్వుతుంది ..చేసిన సినిమాలు కొద తక్కువే .ఆలా కెరీర్ ని నడుపుకుంటూ వస్తున్నాడు ఈ మిడిల్ క్లాస్ డైరెక్టర్ .అల్లు వారి కాంపౌండ్ లో అల్లు శిరీష్ తో శ్రీరాస్తూ శుభమస్తు లాంటి ఓ క్లాస్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా ఇచ్చిన హిట్ తో అల్లు అర్వింద్ తన బ్యానర్ లోనే తర్వాత సినిమాలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు

తర్వాత వచ్చిన సినిమానే గీత గోవిందం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది .అంత పెద్ద హిట్‌ ఇచ్చిన దర్శకుడి మలి చిత్రం తమతో వుంటుందంటే ఎవరికి ఆనందం వుండదు? కాకపోతే పరశురామ్‌కి అడ్వాన్స్‌ ఇచ్చిన నిర్మాతలలో ఎవరికీ ఫలానా డేట్‌కి సినిమా చేసిస్తానని మాట ఇవ్వలేదు. దీంతో వాళ్లంతా అతని కోసం వెయిట్‌ చేయక తప్పదు. పరశురామ్‌కి ఎప్పుడో జమానాలో అడ్వాన్స్‌ ఇచ్చిన మంచు విష్ణు వెంటనే అతనితో ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అయితే గీతా ఆర్ట్స్‌ పెంచుకున్న ఈ చెట్టుకి కాసిన పళ్ళని మంచు వాళ్లు కోసుకోకుండా కంచె వేసేస్తున్నారు. ఇంకా అతని వద్ద కథ ఏమీ సిద్ధంగా లేకపోయినా కానీ వరుణ్‌ తేజ్‌తో ఒక మాట అనేసుకుంటున్నారు. పరశురామ్‌ మలి చిత్రం కూడా గీతా ఆర్ట్స్‌లోనే వుంటుంది. వరుణ్‌తో ఇంకా సినిమా తీయని గీతా ఆర్ట్స్‌లో అతనికి ఇదే తొలి చిత్రమవుతుంది.

అయితే తమతోనే ముందుగా సినిమా చేయాలంటూ పరశురామ్‌కి అడ్వాన్స్‌ ఇచ్చిన నిర్మాతలు కొందరు ఛాంబర్‌ని ఆశ్రయించబోతున్నారని టాక్‌ వుంది. నిన్న మొన్నటి వరకు నెక్స్‌ట్‌ సినిమా ఎప్పుడని చూసిన డైరెక్టర్‌కి ఒకేసారి గీత మారిపోయి నెక్స్‌ట్‌ సినిమా మొదలు పెట్టడానికి అరడజను మంది క్యూలో వున్నారిప్పుడు