ప్రపంచ దేశాలను వణికించిన మాల్ వేర్ 'వాన్నా క్రై' దాడులకు అమెరికా కారణమని మైక్రోసాఫ్ట్ సంస్థ ఆరోపించిన నేపథ్యంలో సైబర్ దాడుల వెనుక ఉత్తర కొరియా హస్తముందని అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా కనుగొన్నామని సెక్యూరిటీ రిసెర్చులు ప్రకటన చేశారు.లాజరస్ అనే హ్యాకర్ గ్రూప్ ఉత్తర కొరియా ప్రభుత్వంతో సంబంధాలను కలిగివుందని వారి టూల్ కోడ్‌ను హ్యాక్ అయిన కంప్యూటర్లలో కనుగొన్నామని ఫిడిలిస్ సైబర్ సెక్యూరిటీలో థ్రెడ్ రీసెర్చ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న జాన్ బాంమెనెక్ చెప్పారు.
ఉత్తర కొరియా నిపుణులు వాన్నాక్రై కోడ్ రాసుంటారని అలా జరగక పోయి వుంటే, ఓ థర్డ్ పార్టీ కోడ్‌ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడినట్టుగా భావించాలని తెలిపారు. కాగా వైరస్ దాడులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయాన్ని శోధిస్తున్నామని వైట్ హౌస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సలహాదారు థామస్ బోసెర్ట్ తెలిపారు.