ఈ చిత్రంలో కనిపిస్తున్న మ్యాప్ అమెరికాలో నిర్వహించిన వేలం పాటలో 7,08,000డాలర్లు(దాదాపు 4కోట్లు) పలికింది. అమెరికాలో డిస్నీల్యాండ్ థీమ్ పార్కును ఏర్పాటు చేయడానికి ఈ మ్యాప్‌ను 1953లో రూపొందించారు. వాల్ట్ డిస్నీ తన స్నేహితుడితో కలిసి ఈ మ్యాప్‌ను తయారు చేశారు. ఈ మ్యాప్ 3x5 ఫీట్లు ఉంటుంది. ఒక మ్యాప్ ఇంత ధర పలుకడం అరుదు.