తెలంగాణ రాష్ట్రంలో వాల్ మార్ట్ స్టోర్లు ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. వాల్‌మార్ట్ ప్రతినిధులతో ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాబోయే ఐదేళ్లలో 10 వాల్‌మార్ట్ స్టోర్లు ఏర్పాటు కానున్నాయని కేటీఆర్ తెలిపారు. ఐదింటిని హైదరాబాద్‌లో, మిగతా ఐదింటిని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం. ఒక్కో వాల్‌మార్ట్‌లో 2 వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందన్న కేటీఆర్ పది వాల్మార్ట్లలో 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు