//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏం చెబుతారో.....!

Category : state

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందారు అన్న సంగతి మనకు తెలిసిన విషయమే.ఐతే ప్రేజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు తోనే సాధ్యమని నమ్మి అభివృద్ధి బాధ్యతలను చంద్ర బాబు కు అప్పగించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉండ గా బడ్జెట్ పై మరో సారి ఆంధ్ర ప్రజలు అసంతృప్తి కి గురయ్యారు.ఐతే ఈ విషయం పై చంద్రబాబు ఏమంటారో అని అందరు అనుకున్నారు.వివరాలలోకి వెళ్తే,

బడ్జెట్‌ ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కొద్దిసేపటి క్రితం అమరావతిలో కీలకమైన సమావేశాన్ని ప్రారంభించారు. బీజేపీతో ఇంకా కలిసుండాలా? తెగదెంపులు చేసుకోవాలా? అన్న అంశంపైనే చంద్రబాబు, ఎంపీలు, మంత్రులతో చర్చించనుండగా, చర్చల అనంతరం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పేరుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ సాగుతుందని చెబుతున్నా, విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయక పోవడం, కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎలా తగ్గించాలన్న విషయంపైనే వాడివేడిగా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.

ఇక టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉండటాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగానే పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. నేతలంతా చెబుతున్న ఒకటే మాట ఏంటంటే, తమ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని. దీంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్రంలోనూ ఉత్కంఠ నెలకొంది.