Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐశ్వర్యరాయ్‌ మ్యారేజ్ లైఫ్ పై హాట్ కామెంట్ చేశాడు....నటుడు వివేక్ ఒబెరాయ్

Category : movies

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ను అవమానించేలా ట్వీట్ చేసి వివాదానికి తెర తీశాడు తన తోటి నటుడు వివేక్ ఒబెరాయ్.ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా అనేక వివాదాల్లో వెలుపెడుతు..... తీవ్ర వివాదాస్పదం గా మారాడు నటుడు వివేక్ ఒబెరాయ్.అసలు వివరాల్లోకి వెళితే.... గతంలో ఐశ్వర్య.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఐశ్వర్యరాయ్‌ అభిషేక్‌ బచ్చన్ ని పెళ్లి చేసుకొని ఓ కూతుర్ని కూడా కన్నది. ఇదంతా అందరికీ తెలిసిందే.అయితే దీన్ని అదునుగా చేసుకుని...తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలకు లింక్ చేస్తూ ఓ వ్యక్తి వివాదాస్పద పోస్ట్ తయారు చేశాడు. అందులో ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని తీవ్ర అభ్యంతర కరంగా రాశారు.

ఐశ్వర్యని అవమానించే విధంగా ఉన్న ఈ పోస్ట్‌ను పోస్ట్ చేయడమే కాకుండా దానికి ట్యాగ్ చేస్తూ ‘క్రియేటివ్...! నో రాజకీయాలు.. కేవలం జీవితమే’ అని కామెంట్ పెట్టాడు. అయితే, ఈ ట్వీట్‌పై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం తన వరకు వచ్చే సరికి నటుడు వివేక్ సైతం స్పందించాడు.‘క్షమాపణ చెప్పాలని నన్ను అడుగుతున్నారు. క్షమాపణ కోరేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే, నేనేం తప్పు చేశా...? నేను తప్పు చేస్తే కచ్చితంగా క్షమాపణ కోరతా..... నేను తప్పు చేశానని అనుకోవడం లేదు. అందులో తప్పేం ఉంది....? ఎవరో మెమేను ట్వీట్ చేశారు. దానికి నేను నవ్వుకుంటూ ట్వీట్ చేశానంతే’ అని వివేక్ వెల్లడించాడు. ఆయనల ఈ విషయం పై స్పందించడం వలన ఈ విషయం కాస్త మరింత వివాద స్పదం గా మారింది.

Related News