Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాకింగ్ న్యూస్... ఆర్‌కే నగర్‌ ఎన్నికలలో 'ఓటుకు హైటెక్‌ నోటు'

Posted a month ago | Category : national

ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్‌ తగలడం చాలా చాలా అరుదైన విషయం. కానీ, అలవోకగా దినకరన్‌ తమిళనాడులోని ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు, అదీ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా.! డబ్బు పంపకాలకు సంబంధించి ఎవరూ తక్కువ తిన్లేదు. 3వేల రూపాయల నుంచి 10వేల రూపాయలదాకా ఒక్కో నోటుకీ రేటు పలికింది.

ఇవి కాక, బహుమతులూ ఆర్కే నగర్‌ ఓటర్లని ఓ రేంజ్‌లో ప్రలోభపెట్టాయి. అందరిలోకీ, దినకరన్‌ హైటెక్‌ వ్యూహం వర్కవుట్‌ అయ్యింది. ఆ హైటెక్‌ వ్యూహం తాలూకు బండారమేంటో ఇప్పుడిప్పుడే బయటపడ్తుండడం గమనార్హం. కేవలం 20రూపాయల నోటుతో దినకరన్‌ అండ్‌ టీమ్‌ మొత్తం వ్యవహారాన్ని హైటెక్‌ పద్ధతిలో చక్కబెట్టేసిందట.

20రూపాయల నోటు, దాని మీద ఓ 'కోడ్‌', ఆ కోడ్‌ ప్రకారం చెల్లింపులు.. ఇదీ ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో దినకరన్‌ అమలు చేసిన 'కంత్రీ' వ్యూహం. 20రూపాయల నోటు మీద, ఎవరికి తోచిన కోడ్‌ వారు రాసేయడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇచ్చిన నోటు తాలూకు నెంబర్‌ని ముందే ఫీడ్‌ చేసుకుని, చెల్లింపుల సమయంలో ఆ నెంబర్‌నీ - కోడ్‌నీ టాలీ చేసుకుని 10వేల రూపాయల దాకా చెల్లింపులు జరిపారట.

ఈ చెల్లింపులకు సంబంధించి 'తగాదా' ముదిరి పాకాన పడ్డంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. 20రూపాయల నోటుతో ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ అధికారంలో వున్న అన్నాడీఎంకే పార్టీ గగ్గోలు పెట్టిందిగానీ, ఆ 'వ్యూహాన్ని' పోలింగ్‌కి ముందే బయటపెట్టడంలో మాత్రం విఫలమయ్యింది. అంత పక్కాగా దినకరన్‌ 'కంత్రీ' వ్యూహాన్ని అమలు చేశాడు మరి.!


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !