//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వొడాఫోన్‌ సరికొత్త ఆఫర్లు

Category : business

టెలికాం ఆపరేటర్‌ సంస్థ వొడాఫోన్‌ తన కస్టమర్లకు ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రీపెయిడ్‌ కస్టమర్లకోసం సూపర్‌ డే, సూపర్‌ వీక్‌, సూపర్‌ అంబరిల్లా అనే మూడు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వొడాఫోన్ కమర్షియల్‌ డైరెక్టర్‌ సందీప్‌ కటారియా ఒక ప్రకటన లో తెలిపారు.

సూపర్‌ డే ప్లాన్‌ లోరోజుకి రూ.19 ల రీచార్జ్‌పై ఉచిత కాలింగ్‌ సదుపాయంతో 100 ఎంబీ 4జీ డేటా ఉచితంగా అందిస్తోంది.

సూపర్‌ వీక్‌ తో పేరుతో లాంచ్‌ చేసిన రెండో ప్లాన్‌లో రూ.49లకు ఏడురోజుల వ్యాలిడిటీతో 250ఎంబీ 4జీ డ్యాటా, వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లో ఉచిత కాలింగ్‌ సదుపాయం ఆఫర్‌ చేస్తోంది.

రూ. 89ల సూపర్‌ అంబరిల్లా ప్లాన్‌లో వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లో ఉచితం కాలింగ్‌, 100 ని.ల ఇతర నెట్‌వర్క్‌లకు కాలింగ్ ఆఫర్‌తోపాటు, 250 ఎంబీ 4జీ డేటా ఉచితం.