Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివేకా హత్య... అంత్య క్రియల అనంతరం దుఃఖంలో జగన్

Category : politics state

ఎంతైనా బాబాయ్ ... రాజకీయంగా తనకు మరింత అవసరం అయ్యే ఎన్నికల సమయంలో బాబాయి మరణం వైఎస్ జగన్ ను కలచి వేసింది. రాజకీయ దురుర్దేశంతోనే తన బాబాయిని హతమార్చారని జగన్ టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. వివేకానంద అంతిమ యాత్రలో పాల్గొన్న జగన్ కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. తీవ్ర ఆవేదనతో తిరుగు ప్రయాణం అయ్యారు.

బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలచివేసింది . ఆయన శనివారం వైఎస్ వివేకానంద రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాదుకు తిరుగుప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఆయన కన్నీటిని ఆపుకోలేక ఏడుస్తూ కనిపించారు.

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బాబాయ్ హత్య జరగడం ఆయనను తీవ్ర వేదనకు గురి చేసిందని సన్నిహితులు అంటున్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన శనివారం సాయంత్రం హైదరాబాదులోని లోటస్ పాండులో విడుదల చేయనున్నారు. 150 మంది పేర్లతో జగన్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. కానీ జగన్ బాబాయి మృతి పట్ల తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చూడాలి సాయంత్రం అయినా జాబితా ప్రకటిస్తారో లేదో ..

Related News