//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ విశ్వరూపం 2 .....ప్రీమియర్ షో టాక్...!

Category : movies

నటనకే నటన నేర్పించగల సమర్దుడు మన లోకనాయకుడు కమలహాసన్. అయన 2013 నటించిన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా విశ్వరూపం 2 ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బొక్కబోర్లా పడ్డట్టు ప్రీమియర్ షో రిపోర్ట్ చుస్తే తెలుస్తుంది.

ఉగ్రవాదం నేపథ్యంలో సాగే కథతో విశ్వరూపం 2 సినిమా తెరకెక్కింది . హీరో కమల్ భారతదేశాన్ని ఉగ్రవాదుల నుంచి రక్షించుకునేందుకు ఉగ్రవాదుల సంస్థల్లో చేరి అక్కడ కుట్రలకు సంబంధించిన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఇండియాకు అందిస్తుంటాడు. ఎప్పటిలాగే కమల్ తన నటనతో మెప్పించాడు కానీ , సినిమా కథ పూర్తిగా కన్ఫ్యూషన్ గా ఉంటుందని చెప్తున్నారు.

ఫస్టాఫ్ మొత్తం చాలా బోరింగ్‌గా ఉంటుంది. నెరేషన్ మొత్తం ఫ్లాట్‌లోనే ముందుకు సాగుతుంది. కమల్ మార్క్‌కు తగినట్టుగా తీసిన రొమాంటిక్ ఎపిసోడ్ కాస్త ఆకట్టుకుంది .ఇక సెకండాఫ్ మాత్రం కొంతలో కొంత బెటర్‌. యాక్షన్ సీన్స్ కొంత వరకు ఆకట్టుకుంటాయి.

ఫైనల్‌గా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్లు తప్ప మిగతా సినిమా మొత్తం అర్థంపర్థం లేని కథనంతో కమల్ విశ్వరూపం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వరూపం సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు అనేది టాక్.