//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వ‌ర‌ల‌క్ష్మీతో ఎఫైర్.. తేల్చేసిన హీరో విశాల్..!

Category : movies

త‌మిళ హీరో విశాల్ న‌టించిన తాజా చిత్రం అభిమ‌న్యుడు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకొని అయ్యి స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌ధ్యంలో తాజాగా ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో విశాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చాలా విషయాలు తెలుసుకున్నా అభిమన్యుడు చిత్ర కథ వింటున్న సమయంలో చాలా విషయాలు తెలుసుకున్నానని విశాల్ విశాల్ తెలిపాడు. ఆర్మీ వాళ్లకు సరిగా రేషన్ ఉండదు, రైతులకు లోన్స్ ఇవ్వరనే విషయం అందరికి తెలుసు. ఆధార్ నంబర్ వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయ‌నే విషయాలు తెలుసుకున్నానని విశాల్ తెలిపాడు.

ఇక రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం అని విశాల్ తెలిపాడు. తాను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. రజని, కమల్ హాసన్ ఏం చేస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నాన‌ని చెప్పారు. వారి మేనిఫెస్టో నచ్చితే వారివెంట నడిచే అవకాశం ఉందని విశాల్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ మంచి చేయాలని ప్రజల్లోకి వచ్చారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు విశాల్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు సంపాదించాలని రాజకీయాల్లోకి రాలేదని అన్నాడు. హీరోయిన్‌తో ఎఫైర్ గురించి చాలా రోజులుగా సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ, విశాల్ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్న నేప‌ధ్యంలో విశాల్ దాని మీద కూడా స్పందించాడు. తనకు వరలక్ష్మి మంచి స్నేహితురాలని విశాల్ తెలిపాడు. తన కష్టాలు సంతోషాలు వరలక్ష్మితో పంచుకుంటానని, మా మధ్య ఎదో జరుగుతోంది అనే వార్తల్లో వాస్తవం లేదని విశాల్ తేల్చి చెప్పాడు.