//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీరెడ్డి-నాని ర‌చ్చ‌.. విశాల్ ట్రెండింగ్ కామెంట్స్‌..!

Category : movies

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని, న‌టి శ్రీరెడ్డి మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నానిపై సోష‌ల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం, నాని ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంప‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశాలు అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై త‌మిళ హీరో విశాల్ స్పందించాడు.

నాకు నాని చాలా కాలంగా తెలుసు. అత‌ను నాకు మంచి స్నేహితుడు. అంత‌మాత్రాన నేను అత‌ణ్ని గుడ్డిగా స‌మ‌ర్థించ‌ను. తాజాగా నానిపై ఆమె శ్రీరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు అస‌మంజ‌సంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లంద‌ర‌కీ సాటి మ‌నుషుల‌తో అత‌ని ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందో తెలుసు. ఏదో ప‌బ్లిసిటీ కోసం ఆరోప‌ణ‌లు చేయ‌డం కాకుండా.. ఆమె వ‌ద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాలి.

అయితే ఇదంతా చూస్తుంటే ఒక‌రి త‌ర్వాత ఒక‌రిని ఆమె వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్న‌ట్టుగా ఉంది. తర్వాత నా మీద కూడా ఆమె ఆరోప‌ణలు చేస్తుందేమో’ అని విశాల్ అన్నాడు. అయితే అన్ని సినీ పరిశ్ర‌మ‌ల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంద‌నేది మాత్రం వాస్త‌వ‌మ‌ని చెప్పాడు. ‘అభిమన్యుడు’ విజ‌యోత్స‌వ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. విశాల్-సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.