//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్‌కు స‌వాల్ విసిరిన హీరో విశాల్..!

Category : movies

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు స‌వాళ్లు కొత్త కాదు. స‌వాళ్ల‌న్నా.. వాటిని విరేవాళ్ల‌న్నా ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. ఇప్పుడు విశాల్ ఎన్టీఆర్‌కు సూప‌ర్ ఛాలెంజ్ విసిరాడు. అదేమిటంటే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఒక హీరోయిన్ పూజా హెగ్దేతో ఉన్న కాంబినేష‌న్ సీన్స్ పూర్త‌య్యాయి. క్లైమాక్స్ సీన్స్ కూడా పూర్త‌య్యాయి.

త్వ‌ర‌లోనే మిగిలిన భాగాన్ని షూటింగ్ చేసేందుకు చిత్ర బృందం పొలాచ్చి వెళ్ల‌నుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తోపాటు ఇషా రెబ్బా కూడా పాల్గొన‌బోతోంది. అయితే, ఈ చిత్రాన్ని ద‌స‌రా వేడుక సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం యోచిస్తోంది. కోలీవుడ్ హీరో విశాల్ న‌టిస్తున్న పందెం కోండి - 2 చిత్రం కూడా ద‌స‌రా వేడుక‌గానే రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం నీదా..? నాదా..? అనే రీతిలో విశాల్ ఎన్టీఆర్‌కు స‌వాల్ విసిరాడ‌న్న‌మాట‌.