//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోచ్ పదవి రేసులో డాషింగ్ ఓపెనర్ ?

Category : sports

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే పదవీకాలం ఛాంపియన్స్ ట్రోఫితో ముగియనుండటంతో మరికొంత కాలం ఆయన పదవిని పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించి ఆశ్చర్యపరిచింది. దీనితో కోచ్ పదవి రేసులో ఉన్నారంటూ పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో క్రికెటర్ పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కోచ్ పదవికి పోటీపడనునట్లు ఇంటర్నెట్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల మేరకు, బీసీసీఐ జనరల్ మేనేజర్లలో ఒకరు సెహ్వాగ్‌ను సంప్రదించి, ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కోరారని తెలుస్తోంది. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా సేవలందించిన ఆయన అనుభవం ఈ పదవికి ఉపకరిస్తుందని కూడా సదరు జీఎం సలహా ఇచ్చారని సమాచారం. కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కూడా హెడ్ కోచ్ పోస్టుకు పోటీ పడవచ్చని వార్తలు వస్తున్నాయి.