టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రీజ్ లో ఉంటే ఎంతటి బౌలర్ అయినా ఊచకోత కోయడంలో దిట్ట. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే వీరూ.. క్రీజులో ఉంటే మాత్రం బౌలర్ల పట్ల ఎంత నిర్దాక్షణంగా విరుచుకుపడతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు సెహ్వాగ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. బ్యాటింగ్ చేసేటప్పుడు సెహ్వాగ్‌కు పాట పాడటం అలవాటు. బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతి బంతిని బౌండరీ కొట్టాలని అనిపిస్తుంది...అందుకే నేను పాటలు పడుతాను అని చెప్పాడు. వీరు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్కు వీరాభిమాని. తాను బ్యాటింగ్ చేసే సమయంలో అతని పాటే పాడుతానని వీరూ చెప్పాడు. మంగళవారం బర్మన్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్లో వీరూ విష్ చేశాడు. అతను కంపోజ్ చేసిన ఆనే వాలా పల్.. అనే పాట తాను పాడుతానని సెహ్వాగ్ ఈ ట్వీట్లో చెప్పాడు.