ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి పేరు తెలియని వారు ఉండరు. తన అసాధారణ ప్రతిభతో ఎన్నో రికార్డులను, అవార్డులను సొంతంచేసుకున్నాడు. ఇప్పుడు ఇక ఈ పరుగుల వీరుడు మరో అవార్డు ఎంపికయ్యాడు.2016 సంవత్సరానికి గాను విజ్డెన్ ప్రపంచ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. గత ఏడాది తిరుగులేని ఫామ్లో ఉన్న విరాట్.. టెస్టుల్లో 75.93 సగటుతో 1215 పరుగులు సాధించాడు. 10 వన్డేల్లో ఏకంగా 92.37 సగటుతో 739 పరుగులు చేశాడు. టీ20ల్లో మరింతగా చెలరేగిపోయిన అతను 106.83 సగటుతో 641 పరుగులు చేశాడు. ఐపీఎల్లోనూ అతను అసాధారణ ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు విజ్డెన్ ఎంపిక చేసింది. గత ఏడాదికి విజ్డెన్ ఉత్తమ క్రికెటర్లుగా మిస్బావుల్ హక్, యూనిస్ ఖాన్, బెన్ డకెట్, టాబీ రొలాండ్జోన్స్, క్రిస్ వోక్స్ నిలిచారు.