ఇండియాన్ క్రికెట్ టీం కెప్టెన్ , పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ . గల్లీ క్రికెట్ నుండి టీం ఇండియా స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం అతని ఫిట్నెసే కారణం . కోహ్లీ ఫిట్ నెస్ చూస్తే , స్టార్ హీరోలకి కి కూడా దిమ్మతిరగాల్సిందే .
ఇక పొతే కోహ్లీ ఇలా ఫిట్ గా ఉండడానికి ప్రధాన కారణం అతను తాగే నీళ్ళే . అతడు తాగే వాటర్ బాటిల్ రేటు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు . 330మి.లీ నీటి సీసా విలువ దాదాపు రూ.800 , అలాగే లీటరు నీళ్ల సీసా ధర రూ.1,440. దీనికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. దీంతో పాటు డిమాండు కూడా అదే స్థాయిలో ఉంది. సరస్సు నుంచి నీటిని తీసి ఎగుమతి చేయడం చాలా ఖర్చుతో కూడిన పని . అంతేకాకుండా ఈ నీటిని నిల్వ చేయడానికి అత్యంత నాణ్యమైన పాలీఇథలీన్ టెరిఫ్తలేట్ సీసాలను ఉపయోగిస్తారు. ఈ సీసాలను తయారు చేయాలంటే ఎన్నో ముందస్తు పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఈ కారణంగానే ఇవియన్ నీళ్లు అంతవిలువైనవి .
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తాగునీటి బ్రాండ్ ఇది. సహజసిద్ధమైన మినరల్ వాటర్‌ను అందించడం ఈ బ్రాండ్ యొక్క ప్రత్యేకత. స్విట్జర్లాండ్- ఫ్రాన్స్ మధ్యలో ఉన్న ఇవియన్-లెస్-బైన్స్ అనే ప్రాంతంలో ఉన్న జెనీవా లేక్ నుంచి ఈ నీటిని తీస్తారు. పశ్చిమ యూరప్‌లో ఉన్న అత్యంత పెద్ద సరస్సుల్లో ఇది ఒకటి. చాలాకాలం కింద భూమిలో కలిగిన రసాయనిక చర్యల వల్ల ఇక్కడి నేలల్లో ఖనిజలవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. జెనీవా సరస్సు కూడా ఇక్కడే ఉండటం వల్ల ఈ నీటికి సహజ సిద్ధంగానే ఖనిజలవణాలు వచ్చాయి .
మొదటగా ఈ నీటిని ఔషధాల తయారీకి మాత్రమే ఉపయోగించేవారు. ఆ తరువాత ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్నది . ఇవియన్ ప్రాంతంలో ఈ సరస్సు ఉంది కాబట్టి ఈ నీళ్లకు కూడా ఇదే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ నీటితో ఔషధాలు తయారు చేయడం మొదలు పెట్టింది. దాదాపు 120 ఏళ్లకు పైగా ఈ నీటిని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే ఉపయోగించారు . 1908లో ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈనీటిని సీసాల్లో ఉంచి విక్రయించడం ప్రారంభించింది.
ఈ నీటికి మరింత డిమాండ్ వస్తుండటంతో 1969లో ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించడం మొదలు పెట్టారు . హాలీవుడ్ చాలామంది ప్రముఖులు ఈ ఇవియన్ నీళ్లనే తాగుతారు.ప్రముఖ ఫొటోగ్రాఫర్ డేవిడ్ లాచాపెల్, అమెరికా మోడళ్లు, నటులు వీటినే తాగుతారు. భారత్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమే ఈ నీటిని తాగుతాడు.