//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీమ్ ఇండియా కెప్ట‌న్‌ విరాట్ కోహ్లీ.. ఒక్క రోజు ఖర్చు ఎంతో తెలిస్తే.. మైండ్ తిరిగివాల్సిందే..!

Category : sports

ప్రస్తుతం ఇండియ‌న్ క్రికెట్‌లో టీమ్ ఇండియా కెప్ట‌న్ విరాట్ కోహ్లీ శఖం నడుస్తోంది. ఏ ఫార్మాట్ అయినా అలవోకగా రన్స్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం టీ20 తరహా క్రికెట్ కు ప్రాధాన్యం పెరగడంతో మరింత ఫిట్‌గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన కోహ్లీ తన శరీరాన్ని ఉక్కుముక్కలా మలుచుకున్న తీరు అద్భుతం అని చెప్పుకోవాలి.

ఒకప్పుడు ఫ్యాటీగా కనిపించిన ఈ ఢిల్లీ డైనమైట్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ తో జీరో ఫ్యాట్ లెవల్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వరసబెట్టి ఎన్నిమ్యాచ్ లు, సిరీస్ లు ఆడినా ప్రతి మ్యాచ్ లోనూ ఫ్రెష్‌గా బరిలో దిగడం కోహ్లీ స్పెషాలిటీ. ఈ ప్రత్యేకత ఊరికే లభించలేదు. కెరీర్ తొలినాళ్లలో అందరిలాగా ఇష్టం వచ్చినట్టు తినడం, జిమ్‌కు డుమ్మా కొట్టడం చేసేవాడు. అంతేకాదు లేట్ నైట్ పార్టీలు, పబ్ లకు తిరగడం, మందు కొట్టడం తప్పనిసరి అన్నట్టుండేవాడు.

అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు కోహ్లీ. టీమిండియా సారథ్య బాధ్యతలు స్వీకరించాక ప్రొఫెషనల్ క్రికెటర్ ఎలా ఉండాలో తెలుసుకున్నాడు. అప్పట్నించి కోహ్లీ డైట్ మారిపోయింది. టోటల్‌గా అతని లుక్కే మారిపోయింది. ప్రతి రోజూ రెండు గంటల పాటు జిమ్‌లో గడుపుతూ.. వెయిట్ ట్రైనింగ్‌తో పాటు కార్డియో ఎక్సర్ సైజులు చేస్తాడు. జిమ్‌లో ఉన్నప్పుడు ఎంతో ఖరీదైన మాస్క్‌ను ఉపయోగిస్తాడు. తద్వారా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. అంతే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే మద్యం, సిగరెట్లకు దాదాపు దూరమయ్యాడు.

టెక్నోషాపర్ అనే పరికరంతో పొత్తికడుపులోని కొవ్వు, నడుము భాగంలోని కొవ్వును తగ్గించుకున్నాడు. ఇక ఆహారం విషయానికొస్తే.. ఉడకబెట్టిన కూరగాయలు, గోధుమలతో తయారైన పదార్థాలను తీసుకుంటాడు. హై ప్రొటీన్ వాల్యూస్ ఉండే నట్స్ ఎక్కువగా తింటుంటాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో 3 కోడిగుడ్లతో ఆమ్లెట్, పెప్పర్ పౌడర్ చల్లిన ఉడకబెట్టిన ఆకుకూర, గ్రిల్ చేసిన పంది మాంసం, గ్రిల్ చేసిన సీ ఫుడ్, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, పుచ్చకాయ, వెన్న, వేరుశనగ పప్పు, గ్లూటెన్ లెస్ బ్రెడ్, లార్జ్ లెమన్ టీ తీసుకుంటాడు.

ఇక లంచ్‌లో రెడ్ మీట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కాల్చిన కోడి మాంసం, బంగాళాదుంపల గుజ్జు, ఫ్రెష్ ఆకుకూరలు తింటాడు. రాత్రి భోజనంలో సీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ ఇస్తాడు కోహ్లీ. మ్యాచ్ కు ముందు రోజు రాత్రి చాలా లైట్ ఫుడ్ తీసుకుంటాడు. కార్బొ ఫుడ్ తో పాటు ప్రొటీన్ మిల్క్ షేక్స్ ఎక్కువగా తాగుతాడు. వీటిన్నింటిని మించిపోయేలా కోహ్లీ ప్రత్యేకమైన బ్రాండెడ్ మినరల్ వాటర్ మాత్రమే తాగుతాడు. ఫ్రాన్స్ లోని సెలయేళ్లలో సేకరించిన నీటితో తయారయ్యే ఎవియాన్ బ్రాండ్ మినరల్ వాటర్ తాగుతాడు.

ఇది ఒక్కో బాటిల్ 1000 ధర పలుకుతుంది. ఇలాంటివి ప్రతి రోజు రెండు మూడు ఖర్చయిపోతుంటాయి. ఆ లెక్కన చూస్తే విరాట్ కోహ్లీ ప్రతి రోజు తన తిండికి, తాగే నీళ్లకు దాదాపు 10000 వరకు ఖర్చుచేస్తాడని సామాచారం. ఇంత మొత్తాన్ని కోహ్లీ ఒక్కరోజులోనే ఖర్చు చేస్తాడంటే ఆయన సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సంవత్సరానికి ఆయన ఆదాయం అన్ని విధాలా లెక్కగడితే 116 కోట్లు ఉంటుందట. ఆదాయం వస్తుంది కదా అని ఆటను మాత్రం అశ్రద్ధ చేయడు కోహ్లీ. ఆ తపనే అతడ్ని ఈ తరంలో తిరుగులేని బ్యాట్స్ మన్‌గా నిలుపుతోందని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.