//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వినయ విధేయ రామ రాఘవ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Category : movies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ బూజు దులపడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘వినయ విధేయ రామ’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌పై అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు చెర్రీ. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో బోలెడన్నీ సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయంటూ చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకోగా తాజాగా సెన్సార్‌కు రెడీ అయ్యింది. ఈ నెల 7న సెన్సార్ పనులు పూర్తయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సెన్సార్ కూడా పూర్తయితే ఇక రిలీజ్‌కు అన్ని విధాలా రెడీ అవుతుంది ఈ మూవీ. చరణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మె్న్స్‌ ఈ సినిమాకే హైలైట్‌ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉండనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ ఉంది. బోయపాటి డైరెక్షన్‌లో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మరి ఈ సినిమాకు సెన్సార్ వారు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చూడాలి. అలాగే 'రంగస్థలం' సినిమా లో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన రామ్ చరణ్ తన కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

'రంగస్థలం' సినిమా లో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన రామ్ చరణ్ తన కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. కీయారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ను డివివి దానయ్య డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 10 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా విడుదల ఇంకా అవ్వలేదు కానీ ఇప్పటికే దాదాపు వంద కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 'వినయ విధేయ రామ' సినిమా 90 కోట్ల కు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు: నిజాం: 20 కోట్లు సీడెడ్: 15 కోట్లు యూఏ: 11.70 కోట్లు ఈస్ట్: 7.20 కోట్లు గుంటూరు: 7.80 కోట్లు కృష్ణ: 6.00కోట్లు వెస్ట్: 5.60 కోట్లు నెల్లూరు: 3.30 కోట్లు ఏపీ/తెలంగాణ: 77 కోట్లు పక్క రాష్ట్రాల్లో: 8.50 కోట్లు ఓవర్సీస్: 9 కోట్లు ప్రపంచవ్యాప్తంగా: 94.10 కోట్లు.