//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రికార్డు స్థాయిలో "ప్రీ రిలీజ్ బిజినెస్" చేసిన... "వినయ విధేయ రామా"

Category : movies

ఈ సంక్రాంతి కానుకగా వస్తున్న సినిమాల బరిలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న 'మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్' "వినయ విధేయ రామా" సినిమా రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు '95 కోట్ల' రూపాయల కి పైగా చేసినట్టు కేవలం ధియేటర్ బిజినెస్ మాత్రమే ఈ లేవల్ లో ఉంటే ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అండ్ హిందీ హక్కులను కలుపుకుంటే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రామ్ చరణ్ సినిమాల్లో నే అత్యంత అధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి సినిమా గా రికార్డు సెట్ చేసింది.

రామ్ చరణ్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంతా స్థాయిలో బిజినెస్ చేయడం గొప్ప విశేషం.అయితే రంగస్థలం సినిమాకి ముందు రామ్ చరణ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 50 నుంచి 60 కోట్లు ఉంటే "రంగస్థలం" ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో మరింతగా మార్కెట్ పెరిగింది. ఆలాగే ఈ సినిమాకి దర్శకుడు బోయపాటి శ్రీను కావడం. పక్క మాస్ యాక్షన్ మూవీస్ తీయడంలో వరుస విజయాలతో మంచి సక్సెస్ రేట్ ఉండడం.ఇంకా ఇతర హక్కులు అనగా ఓవర్సీస్ బిజినెస్ కూడా మంచి రేట్ కే అమ్ముడు పోవడం మరింతగా ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.

అలాగే ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్న

"ఎన్.టి.ఆర్ బయోపిక్", (ఫన్ అండ్ ప్రేస్టేషన్ )'F2', సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ "పేటా" వీటితో పాటు రిలీజ్ అవుతుండడం తో ఈ స్థాయి అంచనాల నడుమ ఆ స్థాయి వసూళ్లు రాబడుతుందా అనేది. వాటితో పాటు పోటీ పడి విజయాన్ని అందుకుంటూదా అనేది సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే...