//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ గురించి సంచ‌ల‌న నిజం బ‌య‌ట‌పెట్టిన రాముల‌మ్మ‌..!

Category : state politics

ప్ర‌స్తుతం తెలంగాణలో కాంగ్రెస్ త‌రుపున స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో రాముల‌మ్మ పోరాటం ఎన‌లేనిది. త‌న వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింద‌ని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. అంత‌కు ముందు జ‌రిగిన ప‌రిణామాల‌ను త‌లుచుకుంటే విజ‌య‌శాంతి ముందు వ‌రుస‌లో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న పోరాటంలో విజ‌య‌శాంతి న‌డిపిన ఉద్య‌మాలు అమోఘం.

అయితే, ఇత‌రుల ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేని కేసీఆర్ విజ‌య‌శాంతిపై కూడా అదే వ్య‌వ‌హార శైలిని ప్ర‌ద‌ర్శించారు. కార‌ణాలు లేకుండానే, అప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్‌లో ఉన్న‌ విజ‌య‌శాంతిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు కేసీఆర్ అర్థ‌రాత్రి ప్ర‌క‌ట‌న జారీ చేశారు. అయితే, కేసీఆర్ త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డానికి గ‌ల కార‌ణాలు చెప్పాల‌ని విజ‌య‌శాంతి ఇప్ప‌టికే మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని కురిపిస్తూనే ఉంది.

ఇదిలా ఉండ‌గా, టీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ గురైన కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత విజ‌య‌శాంతి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఇక అప్ప‌ట్నుంచి తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌లోపేతానికి కృషి చేస్తూ, కేసీఆర్ చేసిన మోసాల్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ త‌న‌దైన శైలిలో రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు విజ‌య‌శాంతి. తాజాగా, తెలంగాణ‌లో నెల‌కొన్న ముంద‌స్తు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం దృష్ట్యా కాంగ్రెస్ త‌రుపున ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు విజ‌య‌శాంతి.

అయితే, ఇలా విజ‌య‌శాంతి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన ప్ర‌తీ చోటా విజ‌య‌శాంతి త‌న‌దైన శైలిలో కేసీఆర్‌పై విరుచుకుప‌డుతోంది. కేసీఆర్‌త‌న‌క చేసిన అన్యాయాన్ని వివ‌రిస్తూనే, తెలంగాణ పోరాటం స‌మయంలో కేసీఆర్ చేసిన దొంగ దీక్ష‌ల‌పై ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తుంది. కేటీఆర్‌, క‌విత త‌నకు పోటీ కానే.. కాద‌ని, అటువంటి భ్ర‌మ‌లో ఉన్న కేసీఆర్‌ను ఏమ‌నాల‌ని..? త‌న‌కు కేసీఆర్ మాత్ర‌మే పోటీ అని, కేసీఆర్ ఓట‌మికి తాను ఎంత దూర‌మైనా వెళ్తాన‌ని స్ప‌ష్టం చేసింది విజ‌య‌శాంతి. కేసీఆర్ త‌న‌కు దేవుడు ఇచ్చిన అన్న అని తానెప్పుడూ చెప్ప‌లేద‌ని, ఇంకా కేసీఆరే విజ‌య‌శాంతి దేవుడిచ్చిన చెల్లె అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడ‌ని ఎద్దేవ చేసింది.

Related News