//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టార్ హీరోలను వెనక్కి నెట్టి ముందుకు దూసుకువచ్చిన విజయ్ సాయి.....!

Category : movies

విజయ్ దేవరకొండ అనగానే గుర్తుకువచ్చే సినిమా అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమాతో హీరో గా ఆడియన్సను ఆకట్టుకున్న విజయ్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు. ఈ సినిమాలో యూత్ కి ఫేవరేట్ హీరో గా మారిన విజయ్ ఆన్‌లైన్‌ పోల్సులోను తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు.

దీనివల్ల అర్జునరెడ్డి హీరో క్రేజ్ రోజురోజుకి మరింత పెరిగిపోయింది. హైదరాబాద్ టైమ్స్ లేటెస్ట్ గా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ మెన్ 2017 లిస్టులో టాలీవుడ్ స్టార్లకు షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

ఇప్పటివరకు టాలీవుడ్ టాప్ పొజిషన్ లో ఉన్న ప్రభాస్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లుఅర్జున్, రానా,ఎన్టీఆర్ లాంటి హీరోలను సైతం వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు విజయ్.ఈ లిస్ట్ లో పలు టీవీ రియాలిటీ షోలలో పాల్గొని ఆడియన్సుని ఆకట్టుకున్న బాసీర్ అలీ మొదటి స్థానం లో నిలవగా...విజయ్ దేవరకొండ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

విజయ్ 2017 తో తన స్థానాన్ని పోలిస్తే ఈ సంవత్సరంలో 20 స్థానాలు ముందుకు దూసుకువచ్చాడు. ఆ తరువాత స్థానాల్లో ప్రభాస్, రాంచరణ్, రానా,అల్లుఅర్జున్ ఇతర టాలీవుడ్ హీరోలు ఉన్నారు.

Related News