Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో మెగా అల్లుడు కాబోతున్న విజయదేవరకొండ ....!

Category : movies

విజయదేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ క్రియేషన్ చేస్తున్న పేరు . ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా అవతరించాడు . విజయ్ చేసిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో రికార్డ్స్ తిరగరాసింది . అందులో విజయచేసిన పాత్ర కి మంచిమార్కులే పడ్డాయి .త్వరలో మెగా అల్లుడు కాబోతున్న విజయదేవరకొండ ....! ఆనతి కాలం లో నే యూత్ ఐకాన్ గా మారిన విజయ్ నుండి తాజా గా వచ్చిన గీత గోవిందం సినిమా టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డు ని అందుకొని అందరిని ఆశ్చర్య పరిచింది .

ఇక పొతే ప్రస్తుతం టాలీవుడ్ లో మరో వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ త్వరలో మెగా అల్లుడు కాబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు తెగ ట్రోల్ అవుతుంది . నాగబాబు కూతురైన నిహారిక ని విజయదేవరకొండ కి ఇవ్వాలని మెగా కుటుంబం అనుకుంటున్నట్టు సమాచారం .

ఇంతకుముందు కూడా నిహారిక పెళ్లి గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి , ప్రభాస్ , నాగసౌర్య తో పెళ్లి అవి అన్ని కూడా రూమర్స్ అని తేలిపోయింది , కానీ ఈ న్యూస్ వింటుంటే నిజమే అని అనిపిస్తుంది . ఎందుకు అంటే విజయదేవరకొండ లాంటి ఒక అప్ కమింగ్ హీరో ఫంక్షన్ కి టాలీవుడ్ లో అగ్ర హీరో ఎన్నో ఏళ్లుగా నీరాజనాలు అందుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి రావడమేంటి అని అనిపిస్తుంది .

అలాగే విజయ్ నటించిన ఆ సినిమాని మెగా హీరోలందరూ కలిసి తమ ఫ్యామిలీ హీరో సినిమాల ప్రమోషన్స్ చేసారు . అలాగే నిహారిక తండ్రి అయిన నాగబాబు కూడా విజయ్ ప్రవర్తన , వారి ఫ్యామిలీ గురించి తెలుసుకొని విజయ్ నిహారికకు అన్ని విధాలా తగినవాడు అని చెప్పినట్టు సమాచారం . దీనితోనే మెగా హీరోలందరూ పనికట్టుకొని మరి విజయ్ సినిమాకి ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేసారు . ఏది ఏమైనా కూడా విజయ్ మెగా అల్లుడిగా మారితే విజయ్ ని అడ్డుకోవడం ఎవరి సాధ్యం కాదు