//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌కు.. విజ‌య‌వాడ వైసీపీ కీల‌క నేత‌లు ఊహించ‌ని షాక్‌..!

Category : politics

ఏపీలో ఆప‌రేష‌న్ 2019 అని YSRCP ఎప్పుడో అనేసింది. Jagan పాద‌యాత్ర ఉద్దేశం కూడా అదే. ఇటు అసెంబ్లీ ఎన్నిక‌లు, అటు పార్ట‌మెంట్ ఎన్నిక‌లు. రెండింటినీ ఒకేసారి ఎదుర్కొనేందుకు వైసీపీ అధినేత Jagan కొత్త వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారట‌. ఈ క్ర‌మంలోనే ఎంపీలుగా పోటీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పారిశ్రామిక‌వేత్త‌ల మీద జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టారు.

ఈ క్ర‌మంలోనే బెజ‌వాడ‌లో Jagan గీస్తున్న స్కెచ్ ఆ పార్టీలో ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. విజ‌య‌వాడ ఎంపీ అభ్యర్థిగా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త దాస‌రి జ‌య‌ర‌మేష్‌ను బ‌రిలోకి దింపాల‌ని Jagan భావిస్తున్నార‌ట‌. ఇందుకు సంబంధించిన రాయ‌బారాలు కూడా కొన‌సాగుతున్నాయ‌ట‌. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ ఎలాగైనా విజ‌యం సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత మాత్ర‌మే కాదు. విజ‌య‌వాడ‌లో స్ట్రాంగ్ లీడ‌ర్‌గా త‌న ఉనికిని చాటుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ‌లో ఆర్థికంగా, సామాజిక‌ప‌రంగా బ‌ల‌మైన నేత‌ను బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఇద్ద‌రి, ముగ్గుర్నీ వ‌ర్క‌వుట్ చేసే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లించ‌లేదు. మొద‌ట నిర్మాత ఆదిశేష‌గిరిరావును విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జ్‌గా నియ‌మించారు.

అయితే, ఆది శేష‌గిరిరావు తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌డం గుంటూరు పాలిటిక్స్ మీద యాక్టివ్‌గా ఉండ‌టంతో ఆయ‌న స్థానంలో ఇక్బాల్‌ను నియ‌మించారు. ఇక్బాల్ గ‌తంలో చంద్ర‌బాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. ఇక్బాల్‌ను కూడా తాత్కాలికంగానే విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిగా నియ‌మించిన జ‌గ‌న్ కేసినేని నానికి ధీటైన అభ్య‌ర్థి కోసం వేట సాగించార‌ట‌. ఈ క్ర‌మంలోనే దాసస‌రి జ‌య‌రమేష్ అయితే అన్ని విధాలుగా కేశినేని నానికి ధీటుగా నిల‌బ‌డ‌గ‌ల‌ర‌ని Jagan భావిస్తున్నార‌ట‌.

దాస‌రి జ‌య‌ర‌మేష్ 1998లో టీడీపీ నుంచి విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. ఆయ‌న సోద‌రుడు దాస‌రి బాల‌వ‌ర్ధ‌న్ రావు టీడీపీ నుంచి గ‌న్న‌వ‌రంలో పోటీ చేసి విజ‌యం సాధించారు. కొంత‌కాలంగా టీడీపీలో దాస‌రి ఫ్యామిలీ యాక్టివ్‌గా ఉండ‌టం లేదు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానంలో మొద‌ట్నుంచీ కృష్ణా జిల్లాలో బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గ‌మే గెలుస్తూ వ‌స్తుంది. దీంతో Jagan కూడా ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పారిశ్రామిక‌వేత్త‌నే బ‌రిలోకి దింపే ఆలోచ‌న చేస్తున్నారు.

దాస‌రి జ‌య‌ర‌మేష్‌కు పార్టీ కండువా క‌ప్పి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ఇన్‌ఛార్జిగా ప్ర‌క‌టించాల‌ని jagan భావిస్తుంటే అటు నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న లేద‌ట‌. జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌కు అవున‌ని కానీ, కాద‌ని కానీ దాస‌రి జ‌య‌ర‌మేష్ చెప్ప‌డం లేదట‌. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌ను వైసీపీ ప్ర‌భావాన్ని అంచ‌నావేసే ప‌నిలో మాత్ర‌మే ఉన్నార‌ట‌. దీంతో విజ‌య‌వాడ‌లో జ‌గ‌న్ గీస్తున్న స్కెచ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related News