//single page style gallary page

Vijayawada special Restaurant in Airplane

Category : state

Click here to read this article in Telugu

విజయవాడలో వింత రెస్టారెంట్ !!విమానంలో విందు భోజనం!!

పాడైపోయిన ఓ విమానాన్ని లారీపై తీసుకొచ్చి విజయవాడ నగర శివారు నిడమానూరులో జాతీయ రహదారి పక్కన ఉంచారు.గత మూడు రోజులుగా ఇక్కడే ఉంటోంది.చాలా మంది ప్రజలు దానిని వింతగా చూస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నాయి.ఈ విషయం పక్కన పెడితే ఓ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయడానికి దానిని ఇక్కడికి తీసుకొచ్చారంట.ఇప్పటికే ఢిల్లీ లాంటి నగరాల్లో విమాన రెస్టారెంట్లు చాలా ఉన్నాయి.

వాటిని చూసి అదే తరహాలో విజయవాడలో ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన ఓ ఔత్సాహికుడు స్క్రాప్‌లో విమానాన్ని కొనుగోలు చేసాడు.దీన్ని రెస్టారెంట్‌లా తయారు చేసేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించారు.

ఏదైనా రెస్టారెంట్‌కు జనం క్యూ కట్టాలంటే ఒకటి అక్కడి భోజనమైనా బాగుండాలి లేదా ఆ రెస్టారెంట్ సమ్‌థింగ్ ఎట్రాక్టివ్‌గా ఉండాలి. రెండూ కుదిరితే మరీ మంచిది.అందుకే చాలామంది నిర్వాహకులు రెస్టారెంట్లను వినూత్న రీతిలో తీర్చిదిద్దుతున్నారు.రైలు భోగీల్లాగా.. విమానాల్లాగా ఇలా కొత్త తరహాలో రెస్టారెంట్లను నిర్మిస్తున్నారు.తాజాగా విజయవాడలోనూ ఇదే తరహా రెస్టారెంట్ ఏర్పాటు కాబోతున్నట్టు సమాచారం.విమానంలో కూర్చుని తిన్న ఫీల్ కలిగేలా ఇక్కడ ఓ హోటల్ ఏర్పాటు కాబోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

In the suburbs of Vijayawada city, Nidhamanoor is placed on the national highway. It has been here for the past three days. Many people are taking a look at it and taking selfies.

A city-based entrepreneur bought a plane in scrap to make them look similar to Vijayawada. Work is already underway to make it a restaurant.

To queue for any restaurant, one must be fine with the meal or that restaurant must be somehow interactive. It is good to have both. So many managers are designing restaurants innovatively, like a restaurant bakkal .. A new restaurant similar to that of Vijayawada.