Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫెడప్ ఫ్రంట్ అంటూ విజయశాంతి సంచలనం

Category : politics state

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తెలంగాణ సీఎం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను భాగస్వాములుగా చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఏ ఒక్కరి మద్దతును కూడగట్టే లేకపోయారు. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తెలంగాణ రాములమ్మ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కెసిఆర్ ఏర్పాటు చేసేది ఫెడరల్ ఫ్రంట్ కాదని ఫెడ్ అప్ ఫ్రంట్ అని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు.

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశమంతా తిరిగారని, కానీ చివరకు వైసీపీ మద్దతు మాత్రమే పొందగలిగారనేది స్పష్టమవుతోందని ఆమె అన్నారు.ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కలిసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లాంటి వాళ్లు కోల్‌కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో పాల్గొని బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు మద్దతిచ్చారని విజయశాంతి తెలిపారు. టీఆర్ఎస్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందేమోనని ఆమె అన్నారు. ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఏర్పడబోయే కూటమిని ఫెడరల్ ఫ్రంట్ అనడం కంటే "ఫెడప్ ఫ్రంట్" అనాలని విజయశాంతి వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమవుతుందని కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతున్నాయి. మొత్తానికి రాములమ్మ సమయం చూసి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

Related News